అండర్-19 ఆసియాకప్‌లో టీమ్ఇండియా సెమీస్‌కు చేరింది. అఫ్గానిస్థాన్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గెలిచి తర్వాతి సమరానికి సిద్ధమైంది.
సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. కెప్టెన్ సులేమాన్ సఫీ 73, అహ్మద్ జాయ్ 86 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రాజ్వర్ధన్, రాజ్, విక్కీ, కుశాల్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఛేదనలో భారత్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు రఘువంశీ, హర్నూర్ సింగ్.. తొలి వికెట్‌కు 104 పరుగులు జోడించారు. హర్నూర్ సింగ్ అత్యధికంగా 65 పరుగులు చేశాడు. 48.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తిచేసింది యువ భారత్.
గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్థాన్, గ్రూప్-బీ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక.. సెమీస్‌కు అర్హత సాధించాయి. ఒకవేళ సెమీస్ భారత్, పాక్ గెలిస్తే.. ఫైనల్లో దాయాదుల మధ్య పోరు చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది.