ETV Bharat / sports

టైమ్​డ్​ అవుట్​, హ్యాండిల్డ్‌ బాల్‌ - క్రికెట్‌లో ఎన్ని విధాలుగా ఔటవుతారో తెలుసా? - బంగ్లాదేశ్​ వర్సెస్ శ్రీలంక వరల్డ్​ కప్​

Types Of Out In Cricket : శ్రీలంక ప్లేయర్​ ఏంజెలో మాథ్యూస్‌ టైమ్​డ్​ ఔట్‌ ఘటన చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అసలు క్రికెట్‌లో ఓ బ్యాటర్​ను ఎన్ని రకాలుగా ఔటవుతాడన్న విషయం గురించి క్రికెట్​ అభిమానులు నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ఓ బ్యాటర్​ ఎన్ని విధాలుగా ఔటవుతాడంటే..

Types Of Out In Cricket
Types Of Out In Cricket
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 12:55 PM IST

Types Of Out In Cricket : వన్డే ప్రపంచకప్​లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ప్లేయర్​.. ఏంజెలో మాథ్యూస్‌ టైమ్‌డ్​ ఔట్‌గా పెవిలియన్​కు చేరుకున్నాడు. క్రికెట్​ చరిత్రలో ఓ ప్లేయర్​ ఈ విధంగా ఔట్​ అయి డగౌట్​కు చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే అసలు క్రికెట్‌లో ఓ బ్యాటర్​ను ఎన్ని రకాలుగా ఔట్‌గా పరిగణించవచ్చు.. వాటికిగల కారణాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

క్రికెట్​లో అరుదుగా అయ్యే ఔట్​లు..

  • టైమ్​డ్​ ఔట్‌ : నిర్దేశిత టైమ్​లోపు బ్యాటింగ్‌కు రాకపోవడం
  • అబ్​స్ట్రక్టెడ్‌ ఫీల్డ్‌ : ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్‌కు అడ్డుతగలడం
  • హిట్‌ ట్వైస్‌ : బ్యాటర్‌ రెండుసార్లు బాల్​ను కొట్టడం
  • హిట్‌ వికెట్‌ : బ్యాటర్‌ వికెట్లను తగలడం
  • హ్యాండిల్డ్‌ బాల్‌ : బంతిని పట్టుకోవడం లేదా ఆపడం

అయితే ఇలాంటి ఔట్​లు క్రికెట్​ చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అయితే ఇప్పటి వరకు బ్యాటర్లు దాదాపు పైనున్న అన్ని రకాలుగా ఔట్‌ కాగా.. అంతర్జాతీయ క్రికెట్​లో టైమ్​డ్​ ఔట్ పద్దతిలో ఔటవ్వడం మాత్రం ఇదే తొలిసారి.

2007లోనే జరగాల్సింది..
2007లో దక్షిణాఫ్రికాతో టెస్టులో సౌరభ్‌ గంగూలీ టైమ్​డ్​ ఔట్‌ కావాల్సింది. అప్పుడు భారత్‌ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. ఫీల్డింగ్‌కు కొంత సమయం దూరంగా ఉండటం వల్ల సచిన్‌ను అంపైర్లు బ్యాటింగ్‌కు అనుమతించలేదు. తర్వాత రావాల్సిన లక్ష్మణ్‌ స్నానానికి వెళ్లాడు. దీంతో గంగూలీ హఠాత్తుగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. ప్యాడ్లు కట్టుకుని క్రీజులోకి వచ్చి అతడు బంతిని ఎదుర్కోవడానికి ఆరు నిమిషాల సమయం పట్టింది. కానీ దక్షిణాఫ్రికా కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ అప్పీల్‌ చేయడానికి నిరాకరించడం వల్ల గంగూలీ బ్యాటింగ్‌ కొనసాగించాడు.

World Cup 2023 Semi Finals : మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ గెలిచినప్పటికీ.. ఆ జట్టు ఇదివరకే ప్రపంచకప్‌ నుంచి ఎలిమినేట్‌ అయినందున ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక బంగ్లాదేశ్​తో పాటు శ్రీలంక కూడా సేమీస్​ రేసులోంచి నిష్క్రమించింది. ఇక ఇంగ్లండ్‌ కూడా ఇదివరకే ఎలిమినేట్‌ కాగా.. భారత్‌, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. ఇప్పుడు మరో రెండు సెమీస్ బెర్త్​ల కోసం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి.

బంగ్లా చేతితో శ్రీలంక చిత్తు - ఎట్టకేలకు టోర్నీలో రెండో విజయం

క్రీజులోకి ఆలస్యంగా వచ్చిన లంక బ్యాటర్​ - టైమ్​డ్​ అవుట్​గా వెనక్కి, క్రికెట్​ చరిత్రలోనే తొలి ప్లేయర్!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.