Last ball six win: క్రికెట్లో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. తాజాగా అలాంటి అద్భుతమే చోటు చేసుకుంది సూపర్ స్మాష్ టీ20 న్యూజిలాంట్ టోర్నీలో. ఓ జట్టుకేమో విజయానికి ఓ వికెట్ కావాలి. మరో టీమ్‌కు ఆఖరి బంతికి ఆరు పరుగులు కావాలి. క్రీజులో ఉన్నదేమో టెయిలెండర్. మరి ఇతడు సిక్స్ కొడతాడా లేదా అని సహ ఆటగాళ్లతో పాటు ప్రేక్షకుల్లో ఉత్కంఠట నెలకొంది. ఈ క్రమంలోనే ఒత్తిడిని తట్టుకుని ఆఖరి బంతికి సిక్స్ బాది జట్టును గెలిపించాడు న్యూజిలాండ్ బౌలర్ బౌల్ట్.
నేడు(గురువారం) సూపర్ స్మాష్ టీ20 లీగ్‌లో భాగంగా కాంట్బర్రీ కింగ్స్, నార్తర్న్ నైట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కాంట్ జట్టు విధించిన 108 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది నార్తర్న్.
ఈ క్రమంలోనే విజయం దక్కడానికి ఆరు పరుగులు అవసరమైన నేపథ్యంలో.. ఆఖరి ఓవర్లో రెండు బంతులు మిగిలి ఉన్నప్పుడు క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ ఔట్ అయ్యాడు. అప్పుడు ఆఖరి వికెట్‌గా బౌల్ట్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలోనే అతడు చివరి బంతిని లాంగాఫ్ దిశగా సిక్స్ బాది జట్టును ఆదుకున్నాడు. దీంతో ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని అందుకుంది నార్తర్న్. ఇక ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు కాంట్ టీమ్ 17.2 ఓవర్లలోనే 107 పరుగులకు ఆలౌట్ అయింది.
-
TRENT BOULT!!
— Spark Sport (@sparknzsport) December 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Needed 6 runs off the final ball and he delivered!#SparkSport #SuperSmashNZ@ndcricket @supersmashnz pic.twitter.com/GhiSy8DmPf
">TRENT BOULT!!
— Spark Sport (@sparknzsport) December 23, 2021
Needed 6 runs off the final ball and he delivered!#SparkSport #SuperSmashNZ@ndcricket @supersmashnz pic.twitter.com/GhiSy8DmPfTRENT BOULT!!
— Spark Sport (@sparknzsport) December 23, 2021
Needed 6 runs off the final ball and he delivered!#SparkSport #SuperSmashNZ@ndcricket @supersmashnz pic.twitter.com/GhiSy8DmPf
ఇదీ చూడండి: సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా లారా.. కొత్త కోచింగ్ టీమ్ ఇదే