స్వదేశంలో టీమ్ఇండియాను (Team India News) ఓడించడం చాలా కష్టమని న్యూజిలాండ్ తాత్కాలిక సారథి మిచెల్ సాంట్నర్ (Mitchell Santner Captain) అన్నాడు. వచ్చే టెస్టు సిరీస్‌లో స్పిన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలుసని చెప్పాడు.
"ఏ ఫార్మాట్లో అయినా ఇండియాను ఎదుర్కోవడం కఠినమైన సవాలు. 2016లోనే మాకు ఆ అనుభవం ఉంది. కాన్పుర్‌లో తొలి టెస్టుకు మా కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నాను. మాకు మంచి స్పిన్నర్లున్నారు. ఎందుకంటే ఈ సిరీస్‌లో స్పిన్ కీలక పాత్ర పోషిస్తుంది."
-మిచెల్ సాంట్నర్, న్యూజిలాండ్ బౌలర్
స్వదేశంలో అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ చెలరేగిపోతారని సాంట్నర్ (Mitchell Santner News) చెప్పాడు. అయితే తమకు అజాజ్, సోమర్విల్ ఉన్నారని ధీమా వ్యక్తంచేశాడు.
ఆదివారం కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 73 పరుగుల తేడాతో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma News) అర్ధ శతకంతో, అక్షర్ పటేల్ మూడు వికెట్లతో చెలరేగిపోయారు. ఈ సిరీస్‌పై స్పందించిన సాంటర్న్.. తాము ఆదిలోనే వికెట్లు తీయడంలో విఫలమైనట్లు చెప్పాడు.
భారత్-కివీస్ మధ్య (India vs New Zealand Test Series) తొలి టెస్టు కాన్పుర్‌లో 25-29 వరకు జరగనుంది. ముంబయిలో డిసెంబర్ 3-7 వరకు చివరిదైన రెండో టెస్టు నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి:
కివీస్‌పై టీమ్ఇండియా విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్
రోహిత్ ప్రపంచ రికార్డు- కోహ్లీని వెనక్కునెట్టి..
IND vs NZ: 'ద్రవిడ్, రోహిత్ అర్థమవ్వాలంటే కాస్త వేచిచూడాలి'