ETV Bharat / sports

సూర్య.. సూర్యకుమార్‌.. పేరు గుర్తుపెట్టుకో.. ప్రత్యర్థి  ఎవరైనా దబిడి దిబిడే - సూర్యకుమార్​ యాదవ్​ సెంచరీ

Suryakumar yadav century: ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టీ20 సూర్యకుమార్​ అద్భుత ప్రదర్శనను మాజీలు ప్రశంసిస్తున్నారు. ఇంగ్లాండ్​ కెప్టెన్​ జోరూట్​ కూడా అతడి ఆటకు ఫిదా అయిపోయాడు. ఓ సారి అతడిని ఎవరెవరు ఏమని ప్రశంసించారో చూద్దాం..

surykumar yadav century
సూర్యకుమార్‌ యాదవ్‌ సెంచరీ
author img

By

Published : Jul 11, 2022, 4:37 PM IST

Suryakumar yadav century: ఇంగ్లాండ్‌తో మూడో(చివరి) టీ20లో టీమ్‌ఇండియా 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఇన్నింగ్స్‌ మాత్రం మ్యాచ్‌కే హైలైట్‌. 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో 117 పరుగులు ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. మిగిలిన బ్యాటర్ల సహకారం లేకపోవడం వల్ల టీమ్‌ఇండియాకు పరాజయం తప్పలేదు. కానీ, సూర్య శతకం భారత అభిమానులనే కాదు.. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌తో సహా ఆ దేశ అభిమానులను కూడా ఆకట్టుకొంది.

మైదానం నలువైపులా షాట్లు ఆడుతూ పోరాడిన తీరు అద్భుతం. బౌలర్‌ ఎలాంటి బంతి వేసినా సూర్య బౌండరీకి పంపించాలనుకుంటే... తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో ఫీల్డర్‌ లేని ప్రదేశంలోకి బాల్‌ని తరలించడం అతడి ప్రత్యేకత. ఆఫ్‌సైడ్‌ సిక్సర్లు.. స్ట్రయిట్ ఫోర్లు.. ఫైన్‌ లెగ్‌ వైపు సూర్య బాదిన బౌండరీలతో ట్రెంట్‌బిడ్జ్‌ మైదానంలో పరుగుల వరద పారింది. దీంతో టీ20ల్లో సూర్య తన తొలి శతకం నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన టీమ్‌ఇండియా మాజీ ఆటగాళ్లు ట్విటర్‌ వేదికగా సూర్యను అభినందించారు.

మ్యాచ్‌ అనంతరం టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ మాట్లాడుతూ... కొంతకాలంగా సూర్య బ్యాటింగ్‌ చూస్తున్నాను. అతడు ఆడే షాట్లు అద్భుతంగా ఉంటాయి. సూర్య టీమ్‌ఇండియాలోకి వచ్చినప్పటి నుంచి బలమైన ఆటగాడిగా ఎదుగుతున్నాడు. తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టగలడు అని అన్నాడు. ఇంకా ఎవరెవరు ఏమన్నారంటే..

  • Remember the name….SKY!

    — Gautam Gambhir (@GautamGambhir) July 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Wow SKY! Surya shining at it's brightest. Crazy hitting #IndvEng

    — Virender Sehwag (@virendersehwag) July 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: బామ్మా బామ్మా బంగారు.. 94ఏళ్ల వయసులో 'స్వర్ణ' రికార్డు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.