ETV Bharat / sports

Top 5 bowlers in 2021: ఈ ఏడాది టాప్​-5 బౌలర్లు వీరే!

author img

By

Published : Dec 30, 2021, 9:32 AM IST

Updated : Dec 30, 2021, 12:06 PM IST

Top 5 all format bowlers in 2021: ఈ ఏడాది బ్యాటర్లతో పాటు బౌలర్లు కీలకంగా వ్యవహరించారు. ఏకంగా సిరీస్​ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అలా ఈ ఏడాది అన్ని ఫార్మాట్​లలో సత్తా చాటిన టాప్​-5 బౌలర్లపై ఓ లుక్కేద్దాం..

Top 5 bowlers in 2021, ఈ ఏడాది టాప్ 5 బౌలర్లు

Top 5 all format bowlers in 2021: కరోనా వల్ల క్రికెట్​లో చాలా మార్పులు వచ్చాయి. ఆటగాళ్లు.. బయోబబుల్​, క్వారంటైన్​లో ఉంటూ మానసికంగా, శారీరకంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తమవంతు ప్రదర్శన చేస్తూ అభిమానులను అలరించారు. చాలా మంది ప్లేయర్లు ఒంటిచేత్తో మ్యాచ్​లను గెలిపించారు. వీరిలో బ్యాటర్లు మ్యాచ్​లను గెలిపిస్తే, బౌలర్లు టోర్నీ విజయాల్లో కీలకంగా వ్యవహరించి సత్తా చాటిన సందర్భాలు ఉన్నాయి. ఓ సారి ఈ ఏడాది మొత్తాన్ని నెమరువేసుకుంటే ప్రతి జట్టులోనూ బలమైన బౌలింగ్​ లైనప్​ కనపడుతోంది. ప్రపంచంలోని ప్రతిజట్టుపై వీరు అద్భుత ప్రదర్శన చేస్తూ కీలక వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా, ఈ ఏడాది ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో అన్ని ఫార్మాట్లలో కలిపి సత్తా చాటిన టాప్-5 బౌలర్లు ఎవరో తెలుసుకుందాం..

అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్​గా

రవిచంద్రన్​ అశ్విన్​.. టీమ్​ఇండియాకు కీలక స్పిన్నర్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం అక్కర్లేదు. ఈ ఏడాది అద్భుతంగా రాణించి భారత జట్టు సాధించిన అద్భుత విజయాల్లో భాగస్వామమ్యాడు. ఆడిన ఎనిమిది టెస్టు​​ మ్యాచ్​ల్లో 16.23 సగటుతో 52 వికెట్లు దక్కించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్​లో ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన ఇతడిదే. అందులో మూడు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. స్వదేశంలో ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​లో మెరుగైన ప్రదర్శన చేసి ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్​ అవార్డు అందుకున్నాడు. ఈ సిరీస్​లో నాలుగు మ్యాచ్​లు ఆడిన అతడు 14.71 సగటుతో 32 వికెట్లను సాధించాడు. అయితే చాలా కాలం పరిమిత ఓవర్ల క్రికెట్​కు దూరమైన ఇతడు తన ఆటతో టీ20 ప్రపంచప్​లో అవకాశం తుదిజట్టులోనూ అవకాశం దక్కించుకుని సత్తాచాటాడు.

ashwin
రవిచంద్రన్​ అశ్విన్​

కోహ్లీ, రోహిత్​ వికెట్లను

ఈ మధ్య కాలంలోని గణాంకాలు చూస్తే పాకిస్థాన్ ఉత్తమ బౌలర్​గా షాహీన్​ అఫ్రిది పేరు ఎక్కువగా వినపడుతోంది. అన్ని ఫార్మాట్​లలో అతడు బాగా రాణిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్​లో కోహ్లీ, రోహిత్​, రాహుల్​ వంటి కీలక వికెట్లు తీసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. 9 టెస్టుల్లో 47 వికెట్లు తీసి ఈ ఏడాది అత్యధిక వికెట్లను పడగొట్టిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇందులో మూడు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉండగా.. వెస్టిండీస్​తో జరిగిన రెండో టెస్టులో పది వికెట్లతో దుమ్మురేపాడు.

shaheen afridi
షహీన్​ అఫ్రిది

ఆరు వికెట్ల ప్రదర్శనతో ఘనంగా

దక్షిణాఫ్రికా స్పీడ్​స్టర్​ ఎన్రిజ్​ నోర్జ్టే.. ఈ ఏడాది టీ20, టెస్టు ఫార్మాట్​లో అదరగొట్టాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో ఆరు వికెట్ల ప్రదర్శన చేసి ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించాడు. పాకిస్థాన్​తో జరిగిన సిరీస్​లోనూ 26.88 సగటుతో ఏకంగా 9 వికెట్లను తీసి ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఆడిన ఐదు టెస్టు మ్యాచ్​ల్లో 20.76 సగటుతో 25 వికెట్లు తీయగా.. 11 టీ20ల్లో 15 వికెట్లను దక్కించుకున్నాడు.

anrich norje
అన్రిచ్​ నోర్జె

టీ20 ప్రపంచకప్​ విజయంలో కీలకంగా

జోష్​ హెజిల్​వుడ్​.. కొద్దికాలంగా అన్ని ఫార్మాట్లలో ఆస్ట్రేలియా జట్టుకు వెన్నుముకగా నిలుస్తున్నాడు. ఆసీస్ టీ20 ప్రపంచకప్​ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. న్యూజిలాండ్​తో జరిగిన ఫైనల్ మ్యాచ్​లో కేన్​ విలియమ్సన్ లాంటి కీలక వికెట్​ను తీయడం సహా​ 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను పడగొట్టాడు. ఈ ఏడాది టీ20ల్లో 15మ్యాచ్​లు ఆడి 6.88 ఎకానమీ రేట్​తో 23 వికెట్లు తీశాడు. టెస్టుల్లోనూ ఆరు మ్యాచ్​లు ఆడి 21.8 సగటుతో 13 వికెట్లను దక్కించుకున్నాడు.

josh
జోష్​ హెజిల్​వుడ్​

టెస్టు​ ఛాంపియన్​షిప్​ విజయంలో కీలకంగా

టెస్టు క్రికెట్​లో బాగా రాణించే టిమ్​ సౌథీ.. పరిమిత ఓవర్ల ఫార్మాట్​లోనూ తానేంటో నిరూపించుకున్నాడు. ఈ ఏడాది న్యూజిలాండ్​ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ట్రోఫీని ముద్దాడడంలో కీలకంగా వ్యవహరించాడు. రెండో ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా బ్యాటింగ్​ లైన్​ప్​ను 4/48తో దెబ్బతీశాడు.

మొత్తంగా ఈ ఏడాది పది టెస్టు​ మ్యాచ్​లు ఆడిన సౌథీ 23.5 సగటుతో 22 వికెట్లను తీశాడు. అందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. భారత్​లో కాన్పూర్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో అతడు చేసిన ఐదు వికెట్ల ప్రదర్శన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక టీ20ల్లోనూ తనదైన ముద్రవేశాడు​. 17మ్యాచ్​ల్లో 7.26 ఎకానమీ రేట్​తో 24 వికెట్లను దక్కించుకున్నాడు.

tim southee
టిమ్ సౌథీ

ఇదీ చూడండి: Rewind 2021: ఈ ఏడాది టీమ్ఇండియా రికార్డులివే!

Last Updated : Dec 30, 2021, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.