ETV Bharat / sports

Olympics: అథ్లెట్లలో జోష్​ నింపిన భారత క్రికెటర్లు

author img

By

Published : Jul 10, 2021, 6:15 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో(Tokyo Olympics) పాల్గొనే భారత అథ్లెట్లు విజయం సాధించాలని ఆకాంక్షించారు టీమ్​ఇండియా క్రికెటర్లు. కెప్టెన్స్ మిథాలీ రాజ్(Mithali Raj)​, విరాట్​ కోహ్లీ(Kohli) సహా పలువురు ఆటగాళ్లు 'చీర్ ఫర్​ ఇండియా' అంటూ వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ, వారిలో ఉత్సాహాన్ని నింపారు.

India cricketers
భారత క్రికెటర్లు

జులై 23 నుంచి ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్​లో(Tokyo Olympics) ప్రారంభం కానున్నాయి. ఇందులో పాల్గొననున్న భారత అథ్లెట్లను దేశ ప్రజలంతా ఉత్సాహపరచాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. ఇప్పుడు దీనికి మద్దతుగా బీసీసీఐ(BCCI) నిలిచింది. భారత క్రికెటర్లందరూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వీడియోను ట్వీట్​ చేసింది. ఇందులో మహిళల, పురుషుల జట్ల కెప్టెన్స్ మిథాలీ రాజ్(Mithali Raj)​, విరాట్​ కోహ్లీ(Kohli) సహా రోహిత్​శర్మ(Rohith Sharma), హర్మన్​ప్రీత్​ కౌర్​, రహానె సహా తదితరులు.. 'చీర్​ఫర్​ ఇండియా' అంటూ కనిపించారు. ఈ మెగా క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులంతా గెలవాలని ఆకాంక్షించారు.

ఎయిర్​ ఇండియా ప్రత్యేక విమానంలో జులై 17న టోక్యో బయలుదేరనుంది భారత బృందం. ఈ నేపథ్యంలో అథ్లెట్లను ఉద్దేశిస్తూ జూన్ ​9 మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ.. వారిని ఉత్సాహపరచాలని ప్రజలను కోరారు. ఇందులో భాగంగానే బీసీసీఐ.. భారత క్రికెటర్లందరీతో కలిసి ఈ వీడియోను రూపొందించింది. ఇప్పటికే 120 మందికి పైగా భారత అథ్లెట్లు ఒలింపిక్స్​కు అర్హత సాధించారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది.

ఇదీ చూడండి: Sachin: వారికి మనమంతా అండగా ఉండాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.