ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య యాషెస్ సిరీస్(Ashes 2021) త్వరలోనే ప్రారంభంకానున్న నేపథ్యంలో.. ఆసీస్ టెస్టు సారథి టిమ్ పైన్(Tim Paine News) కీలక ప్రకటన చేశాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు పేర్కొన్నాడు. ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా క్లారిటీ ఇచ్చింది.
'ఆస్ట్రేలియా పురుషుల టెస్టు జట్టు సారథిగా తక్షణమే తప్పుకొంటున్నట్లు టిమ్ పైన్(Tim Paine Captaincy) ప్రకటించాడు. ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు స్పష్టత ఇచ్చాడు.' అని క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక ప్రకటనలో తెలిపింది.
టిమ్ పైన్ నిర్ణయాన్ని స్వాగతించిన ఆసీస్ బోర్డు.. కొత్త సారథిని నియమించే పనిలో పడింది.
కారణమిదే..
2017లో ఓ మహిళా సహోద్యోగురాలికి టిమ్ పైన్ అసభ్యకర రీతిలో ఉన్న ఫొటోతో సహా పలు మెసేజ్‌లు పంపాడని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా టిమ్ పైన్(Tim Paine Latest news) తప్పుచేసినట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే తాను ఆసీస్ టెస్టు కెప్టెన్‌గా ఉండేందుకు అనర్హుడినని పేర్కొంటూ శుక్రవారం మీడియా ముందుకు వచ్చాడు. ఇది కష్టతరమైన నిర్ణయమే అయినా.. తనకూ, తన కుటుంబంతోపాటు ఆస్ట్రేలియా క్రికెట్‌కు మంచిదని తెలిపాడు.
2018లో ఆసీస్ సారథి స్టీవ్‌స్మిత్ బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకొని నిషేధానికి గురైన విపత్కర పరిస్థితుల్లో పైన్ ఆసీస్ టెస్టు పగ్గాలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే మూడేళ్లు కెప్టెన్‌గా కొనసాగి చివరికి ఇలా రాజీనామా చేశాడు.
అయితే వచ్చేనెల 8 నుంచి ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా టీమ్ ఎంతో ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్ ఆడనుంది. ఈ మెగా టోర్నీకి ముందు పైన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఆ జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: