టీమ్ఇండియా క్రికెటర్ శిఖర్ ధావన్, అతడి భార్య విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది గబ్బర్ సతీమణి అయేషా ముఖర్జీ. శిఖర్ను రెండో పెళ్లి చేసుకున్న అయేషా.. రెండోసారి విడాకులు తీసుకోవడం బాధగా ఉందంటూ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు తమ వివాహ బంధానికి అర్ధాంతరంగా ముగింపు పలికిన స్టార్ క్రికెటర్లు ఎవరో చూద్దాం.
బ్రెట్‌లీ
![These Cricketers Who part ways with life partners](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13005934_cri-1.jpg)
అస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్‌లీ మొదటగా ఎలిజిబెత్ కెంప్ అనే మహిళను 2006లో వివాహమాడాడు. కానీ రెండేళ్ల అనంతరం వీరి బంధానికి తెరపడింది. తర్వాత 2014లో లానా అండర్సన్‌ను పెళ్లి చేసుకున్నాడు ఈ ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్.
మహ్మద్ అజారుద్దీన్
![These Cricketers Who part ways with life partners](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13005934_cri-7.jpg)
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ మొదటగా నౌరీన్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పుత్రుల సంతానం. అనంతరం 1996లో హీరోయిన్ సంగీతా బిల్జానీని పెళ్లి చేసుకోవాలని.. తొలి వివాహం బంధానికి ముగింపు పలికాడు.
దినేశ్ కార్తీక్
![These Cricketers Who part ways with life partners](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13005934_cri-6.jpg)
టీమ్ఇండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ పెళ్లి, విడాకులు ఓ సినిమాను తలపిస్తాయి. మొదటి ఇతడు నికితా వంజరాను పెళ్లి చేసుకున్నాడు. 2012లో ఇతడి భార్య మురళీ విజయ్‌తో అఫైర్ నడుపుతున్నట్లు తెలుసుకుని ఆమెకు విడాకులు ఇచ్చాడు. అనంతరం 2015లో ప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ను వివాహమాడాడు.
జాంటీ రోడ్స్
![These Cricketers Who part ways with life partners](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13005934_cri-8.jpg)
దక్షిణాఫ్రికా ఫేమస్ క్రికెటర్ జాంటీ రోడ్స్ మొదట కేట్ మెక్‌కార్తీని పెళ్లి చేసుకున్నాడు. 19 ఏళ్ల తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చాడు. తర్వాతి ఏడాది మెలానే వోల్ఫ్‌తో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టాడు.
జవగళ్ శ్రీనాథ్
![These Cricketers Who part ways with life partners](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13005934_cri-3.jpg)
టీమ్ఇండియా మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ మొదట జ్యోత్స్న అనే మహిళతో ఏడడుగులు వేశాడు. తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి.. జర్నలిస్ట్ మాధవి పాత్రవలిని పెళ్లి చేసుకున్నాడు.
వినోద్ కాంబ్లీ
![These Cricketers Who part ways with life partners](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13005934_cri-2.jpg)
మైదానానికి బయట ఎప్పుడూ వార్తల్లో నిలిచే భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆసక్తికర విషయాల్లో ఈ పెళ్లి ఒకటి. మొదట ఇతడు తన చిన్ననాటి స్నేహితురాలు నోయిలా లూయిస్‌ను 1998లో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత కొన్ని సమస్యల కారణంగా ఆమె నుంచి విడిపోయి.. ప్రముఖ మోడల్ ఆండ్రియా హెవిట్‌ను వివాహమాడాడు.
సనత్ జయసూర్య
![These Cricketers Who part ways with life partners](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13005934_cri-10.jpg)
1998లో సుముదు కరుణనాయకేతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు శ్రీలంక విధ్వంసకర ఓపెనర్ సనత్ జయసూర్య. ఏడాదిలోనే ఈ బంధం ముగిసిపోయింది. తర్వాత 2000లో సాండ్రాను వివాహం చేసుకున్నాడు. ఆమెకూ 2012లో విడాకులు ఇచ్చాడు.
షోయబ్ మాలిక్
![These Cricketers Who part ways with life partners](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13005934_cri-9.jpg)
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాతో ప్రస్తుతం వివాహ బంధాన్ని ఆస్వాదిస్తున్నాడు పాకిస్థాన్ క్రికెటర్ షోయల్ మాలిక్. కానీ సానియా కంటే ముందు అతడు ఆయేషా సిద్దిఖీని 2002లో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి సానియాను వివాహం చేసుకున్నాడు.
సైమన్ డౌల్
![These Cricketers Who part ways with life partners](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13005934_cri-4.jpg)
న్యూజిలాండ్ పేసర్ సైమన్ డౌల్ మొదట కరిన్ అనే మహిళతో వివాహం బంధంలోకి అడుగుపెట్టాడు. వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అనంతరం వ్యక్తిగత కారణాల వల్ల ఆమెకు విడాకులు ఇచ్చి.. గతేడాది లియోనా హెర్బెర్ట్ను వివాహమాడాడు. అతడి సర్జరీ సమయంలో ఆమెతో ఆస్పత్రిలో పరిచయం ఏర్పడగా.. అది కాస్తా పెళ్లికి దారి తీసింది.
మైకేల్ క్లార్క్
![These Cricketers Who part ways with life partners](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13005934_cri-5.jpg)
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ 2012లో కైలీని వివాహం చేసుకున్నాడు. 7 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరికి ఓ కూతురు ఉంది.