ETV Bharat / sports

బంతితో సచిన్, కోహ్లీ మ్యాజిక్.. బోల్తాకొట్టిన బ్యాట్స్​మెన్!

అద్భుతమైన బ్యాటింగ్​తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్, టీమ్​ఇండియా ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ. వీరు క్రీజులో ఉంటే ప్రతి అభిమాని మ్యాచ్​లో లీనమైపోతారు. క్లాస్​ షాట్లతో ప్రత్యర్థి జట్లపై పూర్తి ఆధిపత్యం వహించే వీరిద్దరూ అప్పుడప్పుడు తమ బౌలింగ్​తోనూ అలరించారు. కొందరు ప్రముఖ బ్యాట్స్​మెన్​ను ఔట్ చేశారు. అలా సచిన్, కోహ్లీ బౌలింగ్​లో ఔటైన ఆ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

author img

By

Published : Aug 18, 2021, 9:01 AM IST

Sachin kohli
సచిన్, కోహ్లీ

భారతే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు స్ఫూర్తిగా నిలిచాడు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్. అతడి బాటలోనే పయనిస్తూ ప్రస్తుతం ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా ప్రశంసలందుకుంటున్నాడు విరాట్ కోహ్లీ. వీరిద్దరూ క్రీజులో కుదురుకుంటే పరుగుల వరద పారాల్సిందే. వారి బ్యాట్​ నుంచి పసందైన షాట్లు జాలువారాల్సిందే. అయితే వీరిద్దరూ బ్యాట్​తోనే కాదు బంతితోనూ రాణించారు. అలా సచిన్, కోహ్లీ చేతికి చిక్కిన ప్రముఖ క్రికెటర్లు ఎవరో చూద్దాం.

కెవిన్ పీటర్సన్ (ఇంగ్లాండ్)

ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్​.. తన ఆటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంగ్లీష్​ జట్టుకు సారథ్యం వహించి ఎన్నో విజయాలనందించాడు. బ్యాట్​తోనూ మెరుగ్గా రాణించాడు. అయితే ఇతడు సచిన్, కోహ్లీ ఇద్దరి బౌలింగ్​లనూ ఔటయ్యాడు. మాస్టర్​ ఇతడిని టెస్టుల్లో ఔట్ చేయగా.. కోహ్లీ టీ20ల్లో తను వేసిన తొలి బంతికే ఇతడిని పెవిలియన్ చేర్చాడు.

2007 ఆగస్టులో భారత్.. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ సిరీస్ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో సచిన్.. పీటర్సన్​ను బోల్తా కొట్టించాడు. మాస్టర్ వేసిన బంతిని షాట్ ఆడబోయిన ఇతడు స్లిప్​లో ద్రవిడ్​కు క్యాచ్ ఇచ్చి 41 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగాడు. ఇందులో సచిన్ 26 ఓవర్లు వేయగా ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్​ డ్రాగా ముగిసింది.

2011 ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యనటకు వెళ్లిన భారత్..​ మాంచెస్టర్ వేదికగా ఏకైక టీ20 ఆడింది. ఈ ఫార్మాట్​లో తొలి ఓవర్ వేసిన కోహ్లీ.. మొదటి బంతికే పీటర్సన్​ను పెవిలియన్ చేర్చాడు. విరాట్ వేసిన వైడ్ డెలివరీని ముందుకొచ్చి ఆడబోగా ధోనీ స్టంపౌట్ చేశాడు. ఈ మ్యాచ్​లో మూడు ఓవర్లు వేసిన విరాట్​.. ఒకే వికెట్ తీశారు. 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మహ్మద్ హఫీజ్, (పాకిస్థాన్)

సచిన్, కోహ్లీకి దొరికిపోయిన మరో క్రికెటర్ మహ్మద్ హఫీజ్. మాస్టర్​ ఇతడిని వన్డేలో ఔట్ చేయగా.. విరాట్ టీ20ల్లో ఇతడిని పెవిలియన్ చేర్చాడు. 2005 ఏప్రిల్​లో భారత పర్యటనకు వచ్చిన పాకిస్థాన్.. తొలి వన్డేను కోచి వేదికగా ఆడింది. ఈ మ్యాచ్​లో ఆరో బ్యాట్స్​మన్​గా వచ్చిన హఫీజ్​ను మాస్టర్ ఔట్ చేశాడు. 42 పరగుల వ్యక్తిగత స్కోరు వద్ద నెహ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇది ఈ మ్యాచ్​లో మాస్టర్​కు ఐదో వికెట్. మొత్తంగా ఐదు వికెట్లతో సచిన్ రెచ్చిపోగా.. పాక్​ను 87 పరుగుల తేడాతో మట్టికరిపించింది భారత్. సచిన్ హఫీజ్​తో పాటు ఇంజమామ్ ఉల్ హక్, అబ్దుల్ రజాక్, షాహిద్ అఫ్రిదీ, మహ్మద్ సమీ వికెట్లను దక్కించుకున్నాడు.

2012 టీ20 ప్రపంచకప్​లో కొలంబోలో(శ్రీలంక) జరిగిన గ్రూప్ మ్యాచ్​లో హఫీజ్​ను తన బంతితో బోల్తా కొట్టించాడు కోహ్లీ. ఓపెనర్​గా వచ్చిన హఫీజ్.. 15 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచ్​లో పాక్ 128 పరుగుల చేయగా భారత్​ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బ్రెండన్ మెక్​కలమ్ (న్యూజిలాండ్)

సచిన్, మాస్టర్ వలలో పడిన మరో క్రికెటర్ బ్రెండన్ మెక్​కలమ్. ఇతడిని టెస్టు​లో సచిన్​, వన్డేలో కోహ్లీ ఔట్ చేశారు. 2009 ఏప్రిల్​లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత్..​ వెల్లింగ్టన్ వేదికగా మూడో టెస్టు ఆడింది. రెండో ఇన్నింగ్స్​లో 6 పరుగుల వద్ద సచిన్ లెగ్ బ్రేక్​కు బలయ్యాడు మెక్​కలమ్. ఇదే ఇన్నింగ్స్​లో జేమ్స్ ఫ్రాంక్లిన్​ను కూడా ఔట్ చేశాడు మాస్టర్. కానీ మ్యాచ్​ను మాత్రం గెలిపించలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్​లో 617 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్​.. 8 వికెట్ల నష్టానికి 281 పరుగులు మాత్రమే చేసి ఓటమి అంచున నిలిచింది. కానీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసి కివీస్​కు ఊరటనిచ్చింది.

2014 జనవరిలో న్యూజిలాండ్ పర్యనటలో టీమ్​ఇండియా వెల్లింగ్టన్ వేదికగా ఐదో వన్డే ఆడింది. ఈ మ్యాచ్లో మెక్​కలమ్ కివీస్ జట్టుకు కెప్టెన్​గా ఉన్నాడు. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇతడిని పెవిలియన్ చేర్చాడు కోహ్లీ. కవర్​లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్​కు చిక్కి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్​లో 7 ఓవర్లు వేసిన విరాట్ 36 పరుగులు సమర్పించుకున్నాడు. తర్వాత బ్యాటింగ్​లోనూ 87 పరుగులతో సత్తాచాటినా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్​లో 87 పరుగుల తేడాతో ఓటమిపాలైంది టీమ్ఇండియా.

McCullum
మెక్​కలమ్

మొత్తంగా సచిన్ తెందుల్కర్ తన కెరీర్​లో టెస్టుల్లో 46, వన్డేల్లో 154, టీ20ల్లో ఓ వికెట్ కలిపి 201 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లీ మాత్రం తన అంతర్జాతీయ కెరీర్​లో వన్డేల్లో 4, టీ20ల్లో 4 వికెట్లతో మొత్తం 8 మందిని ఔట్ చేశాడు.

ఇవీ చూడండి: 'కోహ్లీ సమస్య అదే.. అందుకే పరుగులు రావట్లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.