ETV Bharat / sports

WTC Final 2023 : తుదిపోరుకు అంతా రెడీ.. రోహిత్​కు ఇదే మంచి ఛాన్స్​! - డబ్ల్యూటీసీ 2023లో రోహిత్​ శర్మ

వరల్డ్​ టెస్ట్​ ఛాంపియన్​షిప్​లో భాగంగా జరగనున్న తుదిపోరుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఆసిస్​, భారత్ జట్లు తమ ప్రత్యర్థులపై పంజా విసిరేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ తరుణంలో కెప్టెన్​ రోహిత్​ శర్మ పాత్ర ఏ మేరకు కీలకంగా ఉండనుందన్న విషయంపై క్రీడా విశ్లేషకులు ఏమంటున్నాంటే ?

Rohit Sharma
Rohit Sharma
author img

By

Published : Jun 6, 2023, 8:05 AM IST

Rohit Sharma WTC 2023 : స్టార్​ క్రికెటర్​ రోహిత్‌ శర్మను టీమ్‌ఇండియా కెప్టెన్‌గా చూడాలన్నది ఎప్పట్నుంచో అభిమానుల కల! ఐపీఎల్‌లో మేటి సారథిగా తనకు తాను రుజువు చేసుకున్నప్పటికీ.. అతడి చేతికి భారత జట్టు పగ్గాలు రావడానికి.. అనుకున్నదానికంటే కాస్త ఎక్కువ సమయమే పట్టింది. కానీ టీమ్‌ఇండియా కెప్టెన్‌ అయ్యాక రోహిత్‌ ఏం సాధించాడు అంటే.. దానికి జవాబు లేదు! బ్యాటింగ్‌లోనూ హిట్‌మ్యాన్‌ ఫామ్‌.. ఆశించిన స్థాయిలో లేదు. అయితే ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రూపంలో బ్యాటర్‌గా తనేంటో చాటి చెప్పడానికి.. కెప్టెన్‌గా జట్టుకు ఓ అపురూప విజయాన్ని అందించడానికి రోహిత్‌ ముందు ఓ మంచి అవకాశం ఉందని అభిమానులు అంటున్నారు.

మరోవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆసిస్​ను ఎదుర్కోవడం భారత్‌కు అంత తేలిక కాదనే అంటున్నారు మాజీలు, క్రీడా విశ్లేషకులు. భీకరమైన పేస్‌ దళం, పైగా వారికి అనుకూలించే పరిస్థితులు.. ఇవే టీమ్​ ఆస్ట్రేలియాను అందరికీ ఫేవరెట్​గా నిలుపుతున్నాయి. కాబట్టి రోహిత్‌ శర్మకు ఈ మ్యాచ్‌ కఠిన పరీక్షగానే భావిస్తున్నారు. కానీ అలాంటి ప్రత్యర్థిని, ప్రతికూల పరిస్థితుల్లో ఎదుర్కొని పైచేయి సాధిస్తే.. అటువంటి విజయానికి వచ్చే విలువే వేరు. ఆ కోణంలో చూస్తే రోహిత్‌కు ఇది మంచి అవకాశంలా కనిపిస్తోంది. ఇప్పటివరకు తన బ్యాటింగ్‌ సామర్థ్యాన్ని, నాయకత్వ లక్షణాలను ప్రశ్నిస్తున్న వారికి ఒకేసారి సమాధానం చెప్పడానికి ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌ సరైన వేదిక.

ఇక రోహిత్‌ పూర్తి స్థాయిలో టీమ్‌ఇండియా బాధ్యతలు అందుకుని ఏడాది దాటింది. కానీ మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించింది తక్కువ. టీ20ల్లో మాత్రమే పెద్ద టోర్నీలలో జట్టుకు నాయకత్వం వహించాడు. రోహిత్​ సారథ్యంలో ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌ల్లో టీమ్‌ఇండియా విఫలమైంది. టెస్టుల్లో, వన్డేల్లో కెప్టెన్‌గా రోహిత్ ప్రదర్శన బాగుంది. అతడు పూర్తి స్థాయిలో పగ్గాలందుకున్నాక ఆరు వన్డే సిరీస్‌ల్లో భారత్‌ నాలుగు నెగ్గింది. రెండు ఓడింది. సొంతగడ్డపై జరిగిన అయిదు టెస్టుల్లో మూడు గెలిచిన రోహిత్‌.. ఒకటి ఓడాడు. ఒక మ్యాచ్‌ డ్రా అయింది.

ఇక టెస్టుల్లో అతడికి డబ్ల్యూటీసీ ఫైనల్‌ రూపంలో పెద్ద సవాల్‌ ఇప్పుడే ఎదురవ్వనుంది. అయితే ఈ మ్యాచ్​లో రోహిత్‌ ఫామ్‌ ఆశాజనకంగా లేదు. ఐపీఎల్‌లోనూ పేలవ ప్రదర్శనను చూపించాడు. . అంతకుముందు అంతర్జాతీయ క్రికెట్లో కూడా రోహిత్‌ ఫామ్‌ సాధారణంగానే అనిపించింది. కానీ ఇంగ్లాండ్‌లో హిట్‌మ్యాన్‌ పేరుతో మంచి రికార్డులే (5 టెస్టుల్లో 402 పరుగులు) నమోదయ్యాయి. ఫైనల్‌ జరగబోతున్న ఓవల్‌లో ఇంగ్లాండ్‌పై అతను సెంచరీ చేయడం విశేషం. ఇంగ్లాండ్‌ పిచ్‌లపై రోహిత్‌కు మంచి అవగాహనే ఉంది.. దీంతో అంత అనుభవం లేని శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి జట్టుకు మంచి ఆరంభాలనివ్వాల్సిన భారం రోహిత్​పై ఉంది. ఇక కెప్టెన్‌గా మంచి వ్యూహ చతురత ఉన్నవాడిగా.. తనకున్న పేరును ఈ మ్యాచ్‌లో నిలబెట్టుకోవాల్సి ఉంది. ప్రత్యర్థి ఎంత బలంగా ఉన్నా.. పరిస్థితులు ప్రతికూలమైనా కూడా వెనుతిరగకుండా ఆత్మవిశ్వాసంతో ఆడితే పైచేయి సాధించడం కష్టమేమీ కాదని టీమ్‌ఇండియా గత కొన్నేళ్లలో అనేక మ్యాచ్‌ల్లో రుజువు చేసింది.

ఈ దిశగా జట్టులో స్థైర్యం నింపడం రోహిత్‌ ముందున్న పెద్ద బాధ్యత అలాగే మేలిమి కూర్పుతో సరైన జట్టును బరిలోకి దించడం నుంచి.. పేసర్లను సమర్థంగా ఉపయోగించుకోవడం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించడం లాంటి పనులన్నింటిలోనూ.. రోహిత్‌ తన మార్క్​ను చూపించాల్సి ఉంటుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచ మేటి బ్యాటర్లలో ఒకడిగా పేరున్న రోహిత్‌కు.. టెస్టుల్లో చెప్పుకోదగ్గ రికార్డులు లేవు. కెరీర్‌ పీక్స్​లో ఉన్న రోహిత్‌.. టెస్టుల్లో ఇంకెంతో కాలం కొనసాగకపోవచ్చు. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఉత్తమ బ్యాటింగ్‌ ప్రదర్శన, నాయకత్వ లక్షణాలతో జట్టును గెలిపిస్తే.. ఇక అతని టెస్టు కెరీర్‌కు ఘనమైన ముగింపు దక్కినట్లే!

ఆ ఇద్దరూ అందుకోవాలి..
డబ్ల్యూటీసీ ఫైనల్లో పేరుకు రోహిత్‌ ఒక్కడే కెప్టెన్‌ కానీ.. మంచి రికార్డున్న మరో ఇద్దరు కెప్టెన్ల అండ కూడా ఆ జట్టుకు పుష్కలంగా ఉంది. భారత క్రికెట్‌ చరిత్రలోనే కెప్టెన్‌గా టెస్టుల్లో అత్యధిక విజయాలందుకోవడమే కాక.. విదేశాల్లో మెరుగైన రికార్డున్న కింగ్​ కోహ్లికి తోడు.. ఆస్ట్రేలియాలో తాత్కాలిక సారథిగా చారిత్రక విజయాన్నందించిన అజింక్యా రహానె ఇప్పుడు ఈ జట్టులో సభ్యులు. కెప్టెన్సీ వదులుకున్న కొత్తలో కోహ్లిలో ఉత్సాహం తగ్గి.. ఆ ప్రభావం తన ఆట మీద పడింది. కానీ గత కొన్ని నెలల్లో విరాట్‌ ఆటతో పాటు తన తీరు కూడా మారింది. రోహిత్‌ నాయకత్వంలో ఆడే విషయంలో కోహ్లి బాగానే సర్దుకున్నట్లు కనిపిస్తున్నాడు.

virat kohli
విరాట్ కొహ్లి

ఇక భేషజాలు పక్కన పెట్టి డబ్ల్యూటీసీ ఫైనల్లో జట్టును గెలిపించడానికి బ్యాటర్‌గా తాను చేయాల్సిందంతా చేస్తూనే రోహిత్‌కు వ్యూహాల్లో విరాట్‌ సహకరించాల్సిన అవసరం చాలా ఉంది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆస్ట్రేలియాపై భారత జట్టుకు చిరస్మరణీయ సిరీస్‌ విజయాన్నందించిన రహానె సైతం ఇప్పుడు నాయకత్వ బృందంలో తన వంతు పాత్ర పోషించాల్సిందే. బ్యాటింగ్‌ పరంగా మిడిలార్డర్లో అతను చాలా కీలకం. రోహిత్‌ కూడా వీళ్లిద్దరితో సమన్వయం చేసుకుని జట్టును సమష్టిగా నడిపిస్తే.. ఆస్ట్రేలియా జట్టును చిత్తు చేయడం పెద్ద కష్టమేమి కాదు.

ajinkya rahane
అజింక్య రహానే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.