Test Team Rankings 2024: ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా టాప్‌లోకి దూసుకెళ్లింది. తాజాగా పాకిస్థాన్‌పై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గడం వల్ల ర్యాంకింగ్స్‌లో ఆసీస్ పుంజుకుంది. ప్రస్తుతం ఆసీస్ 118 రేటింగ్స్‌తో అగ్రస్థానంలో ఉండగా, టీమ్ఇండియా (117 రేటింగ్స్) ఒక్క పాయింట్ తేడాతో రెండో ప్లేస్‌లోకి పడిపోయింది.
'స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం వల్ల ఆస్ట్రేలియా మళ్లీ నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. ఇక సౌతాఫ్రికా పర్యటనలో తొలి టెస్టులో ఓడిన భారత్ రెండో స్థానానికి పడిపోయింది' అని ఐసీసీ పేర్కొంది.
ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ఉన్న జట్లు
- తొలి స్థానం- ఆస్ట్రేలియా- 118 రేటింగ్స్
- రెండో స్థానం- భారత్- 117 రేటింగ్స్
- మూడో స్థానం- ఇంగ్లాండ్- 115 రేటింగ్స్
- నాలుగో స్థానం- సౌతాఫ్రికా- 106 రేటింగ్స్
- ఐదో స్థానం- న్యూజిలాండ్- 95 రేటింగ్స్
-
A new No.1 side is crowned in the @MRFWorldwide ICC Men's Test Team Rankings 👑
— ICC (@ICC) January 5, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
More ⬇️
">A new No.1 side is crowned in the @MRFWorldwide ICC Men's Test Team Rankings 👑
— ICC (@ICC) January 5, 2024
More ⬇️A new No.1 side is crowned in the @MRFWorldwide ICC Men's Test Team Rankings 👑
— ICC (@ICC) January 5, 2024
More ⬇️
-
Aus vs Pak 3rd Test: ఆస్ట్రేలియా స్వదేశంలో పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన ఆసిస్, మూడో మ్యాచ్‌లోనూ గెలుపు దిశగా పయనిస్తోంది. మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ (313-10)లో అదరగొట్టిన పాక్, రెండో ఇన్నింగ్స్‌లో తడపడింది. మూడో రోజు ముగిసేసరికి పాక్ 68-7తో నిలిచింది. ప్రస్తుతం పాకిస్థాన్ 82 పరుగులు ఆధిక్యంలో కొనసాగుతోంది.
World Test Championship Points Table 2025: మరోవైపు ప్రపంచటెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ 2023-25) పాయింట్ల పట్టికలో భారత్ టాప్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం టీమ్ఇండియా 54.16 పాయింట్లతో ఆగ్రస్థానంలో ఉండగా, 50.0 పాయింట్లతో సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ వరుస స్థానాల్లో ఉన్నాయి.
ICC Test Cricketer Of The Year: 2023 సంవత్సరానికిగాను టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినేషన్స్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మూడోసారి స్థానం దక్కించుకున్నాడు. గతంలో 2016లో టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలువగా, 2021లో నామినేషన్స్‌లో ఉన్నాడు. ఇక ఆశ్విన్తోపాటు ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ ఉన్నారు.
17 ఏళ్లలో 5 విజయాలు- సఫారీ గడ్డపై సిరీస్ కల నెరవేరేది ఎప్పుడో?