Test Team of the Year 2023 : టెస్ట్ క్రికెట్‌లో ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్ కనబరిచిన టాప్ ప్లేయర్ల జాబితాను ప్రముఖ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ వెలువరించింది. అందులో భాగంగా బెస్ట్ ఎలెవన్ ప్లేయర్లు గల ఓ టీమ్‌ను ప్రకటించింది. దీనికి 'టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023' అనే నామకరణం చేసింది.
ఇక ఈ జట్టులో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇలా భారత్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. అయితే అందులో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు లేకపోవడం వల్ల రన్నింగ్ మెషిన్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు.
-
Star Sports Test team of the year. pic.twitter.com/I0JqE9rCOc
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Star Sports Test team of the year. pic.twitter.com/I0JqE9rCOc
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 26, 2023Star Sports Test team of the year. pic.twitter.com/I0JqE9rCOc
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 26, 2023
మరోవైపు ఆస్ట్రేలియా జట్టు నుంచి ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్‌తో పాటు ప్యాట్ కమిన్స్ ఈ లిస్ట్‌లో స్థానం దక్కించుకున్నారు. అయితే న్యూజిలాండ్ నుంచి మాత్రం కేన్ విలియమ్సన్ ఒక్కడే ఎంపికయ్యాడు. ఇక ఇంగ్లండ్ నుంచి జానీ బెయిర్ స్టో, జో రూట్, స్టువర్ట్ బ్రాడ్ ఈ లిస్ట్‌లో టాప్ పొజిషన్లో ఉన్నారు.
ఇక టీమ్ కూర్పును చూస్తే - ఇందులో ఓపెనర్లుగా ఉస్మాన్ ఖవాజా, రోహిత్ శర్మలను ఎంపిక చేయగా, మిడిలార్డర్‌లో కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రావిస్ హెడ్, జానీ బెయిర్ స్టోలు ఉన్నారు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తమ తమ స్థానాలను దక్కించుకున్నారు. మిగిలిన వారిలో ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్ పేసర్లుగా ప్లేయింగ్ 11లో తమ ప్లేస్‌ను సంపాదించుకున్నారు.
మరోవైపుల లీస్ట్‌లో విరాట్ కోహ్లీ పేరు లేకపోవడం పట్ల పలువురు మాజీలతో పాటు క్రికెట్ అభిమానులు అసంతృప్తి చెందుతున్నారు. ప్రముఖ ఛానెల్‌ను తిట్టిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ టెస్ట్ రికార్డులను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.
2023 Top Performances In Cricket : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది బెస్ట్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో మూడు సెంచరీలు సహా 765 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 50వ సెంచరీ మార్క్ అందుకున్నాడు విరాట్. ఇక టెస్టుల్లో 7 మ్యాచ్‌ల్లో 557 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉంది. రెండు ఫార్మాట్లలో కలిపి 34 మ్యాచ్‌ల్లో 1934 పరుగులు సాధించాడు.
2023 టీమ్ఇండియా 'కుబేరుడు' కుల్దీపే- మరి రోహిత్, విరాట్ సంగతేంటబ్బా?
టీమ్ఇండియాకు వీళ్లే కీలకం!- సఫారీ గడ్డపై ఎవరి ప్రదర్శన ఎలా ఉందంటే?