ETV Bharat / sports

సచిన్ షాకింగ్ నిర్ణయం.. ఈసారి ఆ లీగ్​లో ఆడట్లేదు

Sachin news: గత కొన్ని సీజన్ల నుంచి లెజెండ్స్ క్రికెట్​ లీగ్​లో ఆడుతున్న సచిన్.. ఈసారి మనసు మార్చుకున్నాడు. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు.

sachin
సచిన్
author img

By

Published : Jan 8, 2022, 7:46 PM IST

Legends league cricket 2022: దిగ్గజ సచిన్ తెందూల్కర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది లెజెండ్స్ క్రికెట్​ లీగ్​లో ఆడకూడదని అనుకున్నాడు. ఈ విషయాన్ని ఎస్​ఆర్​టీ స్పోర్ట్స్ మేనేజ్​మెంట్​ సంస్థ వెల్లడించింది.

రిటైర్మెంట్​ అయిన క్రికెటర్ల కోసం ప్రతిఏటా లెజెండ్స్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తుంటారు. ఇటీవల భారత జట్టును కూడా ప్రకటించారు.

Legends League Cricket
లెజెండ్స్ క్రికెట్ లీగ్

అయితే గతేడాది సీజన్​ పూర్తయిన తర్వాత యువరాజ్ సింగ్, పఠాన్ బ్రదర్స్​ తదితరులు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం వల్లే ఈసారి సచిన్, ఆడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం టీమ్​ఇండియా లెజెండ్స్ జట్టులో యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, యూసఫ్​ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.