ETV Bharat / sports

IND vs NZ Test: చరిత్ర సృష్టించిన అజాజ్​.. భారత్​ 325 ఆలౌట్​ - టీమ్​ఇండియా వర్సెస్​ న్యూజిలాండ్​ టెస్ట్​ మ్యాచ్​ స్కోరు

IND vs NZ Test: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా 325 పరుగులకు ఆలౌట్​ అయింది. కివీస్​ స్పిన్నర్​ అజాజ్​ పటేల్​ 10 వికెట్లతో చరిత్ర సృష్టించాడు.

ind vs nz
అజాజ్- మాయంక్ అగర్వాల్
author img

By

Published : Dec 4, 2021, 1:07 PM IST

Updated : Dec 4, 2021, 1:51 PM IST

న్యూజిలాండ్​తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా 325 పరుగులకు ఆలౌట్​ అయింది. కివీస్​ స్పిన్నర్​ అజాజ్​ పటేల్​ 10 వికెట్లతో అదరగొట్టాడు.

IND vs NZ Test, టీమ్​ఇండియా వర్సెస్​ న్యూజిలాండ్​

ఓవర్​నైట్​ స్కోరు 221/4తో రెండో రోజు ఆట ప్రారంభించింది టీమ్​ఇండియా. ఓపెనర్​ మయాంక్ అగర్వాల్​(150) ధనాధన్​ ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు. అయితే ఆట ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే కివీస్ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ టీమ్‌ఇండియాను దెబ్బతీశాడు. ఒకే ఓవర్‌లో సాహా(27), రవిచంద్రన్‌ అశ్విన్‌(0)లను పెవిలియన్‌ పంపాడు. అనంతరం బ్యాటింగ్‌ కొనసాగించిన మయాంక్‌, అక్షర్‌ మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను పూర్తి చేశారు.

అయితే రెండో సెషన్​లో మయాంక్​ అగర్వాల్​ను(150) అడ్డుకున్నాడు అజాజ్​​ పటేల్​. దీంతో 291 స్కోరు వద్ద ఏడో వికెట్​ను కోల్పోయింది టీమ్​ఇండియా. అక్షర్​తో(34) కలిసి మయాంక్​ 67 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే టీమ్​ఇండియా 100 ఓవర్లకు 291/7స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత హాఫ్​ సెంచరీ చేసిన అక్షర్ పటేల్​(52)​ కూడా అజాజ్​​​ బౌలింగ్​లో ఎల్​బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత జయంత్​ యాదవ్​(12), ఉమేశ్​ కూడా తక్కువ స్కోర్​కే వెనుదిరిగారు. దీంతో 325 రన్స్​కు ఆలౌటైంది కోహ్లీసేన.

టీమ్ఇండియా ఫస్ట్​ ఇన్నింగ్స్​

అజాజ్ రికార్డు

Ajaz Patel Record: కివీస్ స్పిన్నర్ అజాజ్​ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఒక ఇన్నింగ్స్​లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్​గా రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు.

ఇదీ చూడండి: IND vs NZ Test: మయాంక్​ దూకుడు.. 300కి చేరువలో భారత్

Last Updated : Dec 4, 2021, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.