Team india vs New zealand 2021: న్యూజిలాండ్‌తో రెండో టెస్టు మూడో రోజు లంచ్ విరామానికి టీమ్ఇండియా 2 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఫలితంగా 405 పరుగుల ఆధిపత్యంలో ఉంది. క్రీజులో గిల్(17*), కోహ్లీ(11*) ఉన్నారు.
69/0తో మూడో రోజు ఆట ప్రారంభించింది టీమ్ఇండియా. ఈ క్రమంలోనే 32వ ఓవర్లో దగ్గర మయాంక్ అగర్వాల్‌ను(62) దెబ్బ తీశాడు కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్. రెండో టెస్టులో ఇతడికి ఇది 11వ వికెట్ కావడం విశేషం. మయాంక్ భారీ షాట్ ఆడబోయి విలయంగ్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
అనంతరం పుజారా(47) కూడా అజాజ్ వేసిన 36వ ఓవర్ చివరి బంతికి స్లిప్‌లో రాస్‌టేలర్ చేతికి చిక్కాడు. అయితే, బంతి నేలకు తాకేలా అనిపించడం వల్ల థర్డ్ అంపైర్ పలు విధాలుగా పరిశీలించి చివరికి ఔటిచ్చాడు. దీంతో భారత్ 115 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది.
ఇదీ చూడండి: భారత్ భళా.. కివీస్‌పై భారీ అధిక్యం