సోషల్‌మీడియాలో ఎప్పుడు.. ఏ పాట ట్రెండ్‌లోకి వస్తుందో తెలియదు. రోజుకో పాట ఫుల్ ట్రెండ్‌లో ఉంటుంది. తాజాగా మాల టమ్ టమ్.. మంతరం టమ్ టమ్ పాట ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు.. ఆ పాటతో చేసిన రీల్స్ కనిపిస్తున్నాయి. సాధారణ వ్యక్తులతో పాటు సెలబ్రిటీలు కూడా ఆ సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ.. ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. తాజాగా టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కూడా అదే పాటకు తన సోదరితో కలిసి తనదైన స్టైల్లో స్టెప్పులేసి దుమ్మురేపాడు.
టీమ్ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆటలోనే కాదు డ్యాన్స్‌లోనూ అదరగొడతాడు. ఈ విషయాన్ని చాలా సార్లు నిరూపించాడు కూడా. గతంలోనూ తన సోదరితో కలిసి ఓ కార్యక్రమంలో డ్యాన్స్ చేసి అబ్బురపరిచాడు. తాజాగా మరోసారి తన సోదరి శ్రేష్ఠతో కలిసి 'మాల టమ్ టమ్.. మంతరం టమ్ టమ్' అనే తమిళ పాటకు బాస్కెట్ బాల్ కోర్టులో స్టెప్పులేశాడు. శ్రేయస్ సోదరి శ్రేష్ఠ.. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం వీరి డ్యాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇకపోతే.. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌కు దూరమైన శ్రేయస్.. రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అయితే తన మార్కు చూపించే విషయంలో రెండు ఇన్నింగ్సుల్లోనూ విఫలమయ్యాడు. దిల్లీ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులు మాత్రమే చేసి రెండుసార్లూ ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. మార్చి 1ను ప్రారంభం కానున్న మూడో టెస్ట్ మ్యాచ్ కోసం శ్రేయస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.