ETV Bharat / sports

నెట్స్​లో శ్రమిస్తున్న రోహిత్, విరాట్- బాక్సింగ్ డే టెస్టుకు టీమ్ఇండియా రెడీ!

​Team India Practice Session : సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమ్ఇండియా డిసెంబర్ 26 నుంచి ఆతిథ్య జట్టుతో టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా ప్లేయర్లు నెట్స్​లో చెమటోడుస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బీసీసీఐ ఎక్స్​లో పోస్ట్ చేసింది.

​Team India Practice Session
​Team India Practice Session
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 2:42 PM IST

Updated : Dec 25, 2023, 2:59 PM IST

​Team India Practice Session : సౌతాఫ్రికా పర్యటనలో టీ20, వన్డే సిరీస్​లు ముగించుకున్న టీమ్ఇండియా ప్రస్తుతం టెస్టులకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 26న ఇరుజట్ల మధ్య తొలి ప్రారంభం కానుంది. దాదాపు 5 నెలల తర్వాత టీమ్ఇండియా టెస్టు ఫార్మాట్​ ఆడనుంది. గత మూడు దశాబ్దాలుగా సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గని టీమ్ఇండియా ఈసారి ఎలాగైన విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్లేయర్లంతా నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

వన్డే వరల్డ్​కప్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా తొలిసారి బరిలో దిగనున్నారు. ఈ క్రమంలో రోహిత్, విరాట్ నెట్స్​లో ప్రాక్టీస్ చేస్తున్నారు. వీలైనంత సేపు నెట్స్​లోనే గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను బీసీసీఐ ఎక్స్​ (ట్విట్టర్​)లో షేర్ చేసింది.'టెస్టు సిరీస్​కు సమయం ఆసన్నమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్​కు సిద్ధంగా ఉన్నాడు' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక రోహిత్, విరాట్​తో పాటు యంగ్ బ్యాటర్లు శుభ్​మన్ గిల్, యశస్వీ జైశ్వాల్, కేఎల్ రాహుల్ కూడా నెట్స్​లో చెమటోడుస్తున్నారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్లేయర్లతోపాటు ప్రాక్టీస్ సెషన్​లో పాల్గొన్నారు.

భరత్​కు చోటు దక్కుతుందా? యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్​ వ్యక్తిగత కారణాల వల్ల పర్యటన నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో మేనేజ్​మెంట్ శ్రీకర్ భరత్​ను ఎంపిక చేసింది. ఇప్పటికే టెస్టుల్లో అరంగేట్రం చేసిన భరత్​కు తొలి టెస్టులో ఛాన్స్ దక్కుతుందా అనేది ఆసక్తిగా మారింది.

టెస్టు సిరీస్ షెడ్యూల్

  • తొలి టెస్టు- డిసెంబరు 26 - 30 వరకు- సెంచురియాన్‌ మధ్యాహ్నం 1:30
  • రెండో టెస్టు- జనవరి 03 - 07 వరకు- కేప్‌టౌన్ మధ్యాహ్నం 2:00

భారత్‌ టెస్టు జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేశ్‌ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), ప్రసిద్ధ్ కృష్ణ.

ఐపీఎల్​ గురించి మిచెల్​ స్టార్క్ కామెంట్స్ - 'ఆ డెసిషన్​ నాదే - అందుకు నేనేం బాధపడను'

సింహంతో గిల్ సెల్ఫీ! 'ఇంత సాహసం అవసరమా బ్రో?'

Last Updated : Dec 25, 2023, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.