Yashasvi Jaiswal Father : టీమ్ఇండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్.. అరంగేట్రం చేసిన తొలి టెస్టులోనే శతకం బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు కుమారుడు సాధించిన ఈ ఘనతకు గర్వపడిన అతడి తండ్రి భూపేంద్ర జైస్వాల్.. చేసిన రోజే (శుక్రవారం) కాంవడ్ యాత్ర చేపట్టారు. భుజాన గంగాజలాన్ని మోసుకుని.. భదోహిలోని తమ నివాసం నుంచి ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్‌కు కాలినడకన బయల్దేరారు. ఈ సందర్భంగా భూపేంద్ర జైస్వాల్ మాట్లాడారు. యశస్వికి టెస్టు క్యాప్ దక్కడం, కెప్టెన్ రోహిత్ శర్మతో ఆడే అవకాశం రావడం వల్ల చాలా సంతోషం ఉంది అని అన్నారు. 'యశస్వి సాధించిన ఘనతకు నా కుటుంబం, మా భదోహి జిల్లా మొత్తం గర్వపడుతున్నాం. నా కుమారుడు మరిన్ని శతకాలు సాధించాలి. అందుకోసమే ఈ యాత్ర చేపట్టాను. నా కుమారుడిని ఇలాగే ఆశీర్వదించాలని ఆ వైద్యనాథుడికి జలాభిషేకం చేసి వేడుకుంటా' అని ఆనందంతో ఉప్పొంగిపోయారు భూపేంద్ర.
తల్లిదండ్రులకు అంకితం : యశస్వి జైస్వాల్
వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్కోకి అరంగేట్రం చేశాడు యశస్వి జైస్వాల్. తొలి టెస్టులోనే 171 పరుగులు చేసి.. అలా అరంగేట్ర మ్యాచ్‌లోనే విదేశీ పిచ్‌పై 150 పైగా పరుగులు చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ దీనిపై స్పందించిన యశస్వి.. కాస్త ఉద్వేగానికి గురయ్యాడు. ఇది తన సుదీర్ఘ ప్రయాణమని. ఈ ప్రయాణంతో తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ ఘనతను తన తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు. తన కోసం తన తల్లిదండ్రులు ఎంతో చేశారని అని అన్నాడు.
Yashasvi Jaiswal Ind Vs WI : అతి పిన్నవయసులో భారత టెస్టు జట్టులో అవకాశం దక్కించుకోవడం అంటే మాములు విషయం కాదు. అలాంటిది విదేశీ గడ్డపై అరంగేట్రం చేసి తొలి టెస్టులోనే సెంచరీ బాదటం అంటే.. ఇక ఆ వ్యక్తి ఘనత చెప్పుకోవాల్సిందే. 21 ఏళ్లకే యశస్వి.. వెస్టిండీస్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే తనదైన శైలిలో విజృంభించి.. జట్టుకు 171 పరుగులను అందించాడు. నిలకడైన ఆటతీరును ప్రదర్శించిన జైస్వాల్.. అలుపెరగని యోధుడిలా ఆడి శతకాన్ని పూర్తి చేశాడు. దీంతో అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన 17వ భారత బ్యాటర్‌గా ఓ అదుదైన రికార్డును తన ఖాతాలోకి వేసుకున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన రెండో లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్‌గా జైస్వాల్ చరిత్రకెక్కాడు. అయితే 2013 మార్చిలో శిఖర్ ధావన్ (187) ఆసీస్‌పై శతకం బాదాడు.