కొందరు క్రికెటర్లు ఆటతోపాటు సోషల్‌మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచూ తమకు సంబంధించిన అప్డేట్లను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. టీమ్ఇండియా ఆలౌరౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా.. ఇంటర్వ్యూలు, వీడియోలు, ఫొటోలు అప్పుడప్పుడు షేర్ చేస్తుంటాడు. తన అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉండేందుకు ఇష్టపడతాడు. అయితే ఇటీవలే ప్రతిష్ఠాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్ ముగియడం వల్ల అతడికి కాస్త విరామం దొరికింది. దీంతో ట్విట్టర్‌ను అలా వాడుదామని ఓపెన్ చేశాడు. కానీ తన ఖాతా సెక్యూరిటీపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎలాన్ మస్క్‌కు రిక్వెస్ట్ పెట్టాడు.
"నా ట్విట్టర్ ఖాతాకు సంబంధించి సెక్యూరిటీపై ఆందోళనగా ఉంది. పాప్‌అప్స్ తరచూ వస్తున్నాయి. ఆ లింక్‌లను తెరిస్తే ఎలాంటి క్లారిటీ రావడం లేదు. మార్చి 19వ తేదీ వరకు గడువునిస్తూ పాప్‌అప్స్ లింక్‌లు కనిపిస్తున్నాయి. కాబట్టి, అప్పటిలోగా నా ఖాతాను భద్రంగా ఎలా ఉంచుకోవాలనేదానిపై మీరు (ఎలాన్ మస్క్) మార్గనిర్దేశం చేస్తే బాగుంటుంది" అని ట్విట్టర్ వేదికగా అశ్విన్ పోస్టు చేశాడు.
-
Ok !! how do I get my Twitter account secure before the 19th of March now, I keep getting pop ups but none of the links lead out to any clarity. @elonmusk happy to do the needful. Point us in the right direction pls.
— Ashwin 🇮🇳 (@ashwinravi99) March 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ok !! how do I get my Twitter account secure before the 19th of March now, I keep getting pop ups but none of the links lead out to any clarity. @elonmusk happy to do the needful. Point us in the right direction pls.
— Ashwin 🇮🇳 (@ashwinravi99) March 15, 2023Ok !! how do I get my Twitter account secure before the 19th of March now, I keep getting pop ups but none of the links lead out to any clarity. @elonmusk happy to do the needful. Point us in the right direction pls.
— Ashwin 🇮🇳 (@ashwinravi99) March 15, 2023
ఎలాన్ మస్క్ ట్విట్టర్ బ్లూటిక్‌ను తీసుకొచ్చినప్పటి నుంచి మన దేశంలో అకౌంట్ల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎవరైనా ట్విట్టర్ బ్లూను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే రెండు దశల్లో నిర్ధరించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక సేవలను సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారికి ట్వీట్లను తొలగించడం, ఎడిట్ చేయడం వంటి అదనపు ఫీచర్లు అందుతాయి. అలాగే అధిక నాణ్యతతో కూడిన సుదీర్ఘ వీడియోలను పోస్ట్ చేయొచ్చు.
ఇటీవలి కాలంలో ట్విట్టర్లో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సేవలు నిలిచిపోతున్న ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఎలాన్ మస్క్ ఇటీవల వెల్లడించారు. అయినప్పటికీ తరచూ సేవల్లో అంతరాయం ఏర్పడుతూనే ఉంటోంది. ట్విట్టర్లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటం కూడా ఈ సమస్యలకు కారణమవుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన వెంటనే కీలక అధికారులు సహా అనేక మంది ఉద్యోగులపై మస్క్ వేటు వేశారు. ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేయకముందు అందులో 7500 మంది ఉద్యోగులు ఉండగా.. తాజాగా ఈ సంఖ్య రెండు వేలకు చేరింది. అందులోని 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ట్విట్టర్ సబ్స్క్రిప్షన్ సేవలు ప్రారంభించడంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నత ఉద్యోగిని సైతం తీసేసినట్లు సమాచారం.
ట్విట్టర్‌కు పోటీగా..
దిగ్గజ సామాజిక మాధ్యమాల మాతృసంస్థ మెటా.. ట్విట్టర్‌కు పోటీగా కొత్త సామాజిక మాధ్యమాన్ని రూపొందిస్తోంది. అంతర్జాతీయంగా ట్విట్టర్‌కు ఉన్న ప్రజాదరణతోపాటు.. ఇప్పుడు ఆ సంస్థ ఎదుర్కొంటున్న గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని సిద్ధం చేస్తోంది. ఉద్యోగుల తొలగింపుతో అప్రతిష్ఠ పాలైన ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయం కోసం యూజర్లు వెతుకున్నారు. దీంతో ఇదే సరైన సమయంగా భావిస్తున్న మెటా.. ట్విట్టర్‌కు పోటీ ఇచ్చేందుకు ఓ యాప్‌ను తయారుచేసేందుకు సిద్ధమైంది.