WTC Final 2023 Team India : భారత్- ఆసీస్ మధ్య జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ అభిమానులు. అయితే గత కొంతకాలంగా భారత్ ఐసీసీ టోర్నీల్లో ఆశించిన స్థాయిలో మాత్రం రాణించటం లేదు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అదరగొడుతున్నా.. కీలక ఐసీసీ టోర్నీలకు వచ్చేసరికి భారత్ చేతులేత్తేస్తోంది! ఇదిలా ఉంటే ఐసీసీ టోర్నీల్లో టీమ్‌ఇండియా ట్రోఫీ అందుకుని దాదాపు పదేళ్లవుతోంది.
భారత్ చివరిసారిగా ధోనీ కెప్టెన్సీలో 2013 జూన్ 23న ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. పదేళ్ల ఐసీసీ ట్రోఫీ కరవును తీర్చుకునేందుకు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 రూపంలో భారత్‌కు గొప్ప అవకాశం లభించింది. ఈ నెల 7 నుంచి 11 వరకు లండన్‌లోని ఓవల్ మైదానంలో కంగారూలతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనుంది టీమ్‌ఇండియా. అయితే ఈ స్టేడియంలో భారత్ ఇప్పటివరకు ఎన్ని మ్యచ్‌లు ఆడింది. అందులోని చివరి ఐదు మ్యాచుల్లో టీమ్‌ఇండియా ప్రదర్శన ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
-
Lights 💡
— BCCI (@BCCI) June 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Camera 📸
Headshots ✅#TeamIndia | #WTC23 pic.twitter.com/9G34bFfg78
">Lights 💡
— BCCI (@BCCI) June 5, 2023
Camera 📸
Headshots ✅#TeamIndia | #WTC23 pic.twitter.com/9G34bFfg78Lights 💡
— BCCI (@BCCI) June 5, 2023
Camera 📸
Headshots ✅#TeamIndia | #WTC23 pic.twitter.com/9G34bFfg78
ఇదే తొలిసారి..
ఇంగ్లాండ్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో భారత్, ఆసీస్ జట్లు మొదటిసారి తలపడనున్నాయి. ఇక్కడ భారత్ ఇప్పటివరకు 14 టెస్టు మ్యాచ్‌లు ఇంగ్లాండ్‌తో ఆడింది. ఐదు మ్యాచుల్లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించగా.. రెండు మ్యాచుల్లో టీమ్‌ఇండియా గెలుపొందింది. మిగిలిన ఏడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ మైదానంలో ఇరుజట్ల మధ్య మొదటి మ్యాచ్ 1936 ఆగస్టులో జరగ్గా.. అందులో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
2021 సెప్టెంబరులో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 157 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మైదానంలో ఆసీస్ టీమ్‌కు కూడా మంచి రికార్డు లేదు. ఇప్పటివరకు ఓవల్‌లో కంగారూలు 38 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. ఏడు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించారు. 17 టెస్టుల్లో ఓడిపోగా.. 14 మ్యాచ్‌లను డ్రాగా ముగించారు. ఇక్కడ ఆస్ట్రేలియా గత 50 ఏళ్లలో రెండుసార్లు (2001, 2015) మాత్రమే గెలుపొందింది.
- — BCCI (@BCCI) June 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— BCCI (@BCCI) June 5, 2023
">— BCCI (@BCCI) June 5, 2023
బ్యాటర్ అవతారమెత్తిన అనిల్ కుంబ్లే!
స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు. ఇలా గింగరాలు తిరిగే బౌలింగ్‌లో మంచి పేరున్న కుంబ్లే.. 2007 ఆగస్టులో ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్ అవతారమెత్తాడు. 193 బంతుల్లోనే 16 ఫోర్లు, 1 సిక్స్ బాదేసి అనుహ్యంగా సెంచరీ సాధించాడు. అతడి కెరీర్‌లో ఇదే ఏకైక సెంచరీ కావడం విశేషం.
అనిల్ కుంబ్లే శతకానికితోడు దినేశ్ కార్తిక్ (91), ధోనీ (92), సచిన్ (82), రాహుల్ ద్రవిడ్ (55) రాణించడం వల్ల మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 664 పరుగులకు ఆలౌటైంది. జహీర్‌ఖాన్, అనిల్ కుంబ్లే మూడేసి వికెట్లతో మెరవడం వల్ల ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 345 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 180/6 వద్ద డిక్లేర్డ్ చేయగా.. 500 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు.. 6 వికెట్ల నష్టానికి 369 పరుగులు చేయడం వల్ల మ్యాచ్ డ్రాగా ముగిసింది. అనిల్ కుంబ్లేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇయాన్ బెల్ 'డబుల్'తో ఇండియాకు ట్రబుల్!
ఓవల్ మైదానం వేదికగా 2011 ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో ఘోర ఓటమిపాలైంది. ఇయాన్ బెల్ (235) డబుల్ సెంచరీకితోడు కెవిన్ పీటర్సన్ (175) శతక్కొట్టడం వల్ల తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 591/6 వద్ద డిక్లేర్డ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్.. 300 పరుగులకే ఆలౌటైంది.
రాహుల్ ద్రవిడ్ (146), అమిత్ మిశ్రా (43) మినహా మిగతా అందరూ చేతులెత్తేయడం వల్ల భారత్‌తో ఇంగ్లాండ్ ఫాలోఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్)లోనూ భారత్ ఆటతీరు మారలేదు. ఈ సారి 283 పరుగులకే కుప్పకూలింది. సచిన్ (91), అమిత్ మిశ్రా (84) మాత్రమే రాణించడం వల్ల భారత్‌కు ఘోర ఓటమి చవిచూడక తప్పలేదు.
-
Hello 👋 from the Oval.#WTC23 #TeamIndia pic.twitter.com/FsDL6tm2aI
— BCCI (@BCCI) June 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hello 👋 from the Oval.#WTC23 #TeamIndia pic.twitter.com/FsDL6tm2aI
— BCCI (@BCCI) June 4, 2023Hello 👋 from the Oval.#WTC23 #TeamIndia pic.twitter.com/FsDL6tm2aI
— BCCI (@BCCI) June 4, 2023
150లోపు రెండుసార్లు ఆలౌట్..!
2014 ఆగస్టులోనూ ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్ చేతిలో భారత్‌కు ఘోర పరాభావం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఏకంగా 244 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత్ రెండు సార్లు 150 లోపే ఆలౌట్ కావడం వల్ల మ్యాచ్ మూడ్రోజుల్లోనే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ పేసర్లు క్రిస్ వోక్స్ (3/30), జోర్డాన్ (3/32), అండర్సన్ (2/51), స్టువర్ట్ బ్రాడ్ (2/27) చెలరేగడంతో భారత్ 148 పరుగులకే ఆలౌటైంది.
కెప్టెన్ ధోనీ (82) పోరాడకుంటే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ (149), అలిస్టర్ కుక్ (79) రాణించడం వల్ల ఇంగ్లాండ్ 486 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్ పేసర్ల ధాటికి భారత్.. 94 పరుగులకే చేతులెత్తేసింది.
వారిద్దరూ పోరాడినా..!
2018 సెప్టెంబరులో ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 118 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 332 పరుగులకు ఆలౌటైంది. అనంతరం జడేజా (86), హనుమ విహారి (56), కోహ్లీ (49) రాణించడం వల్ల తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 292 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో అలిస్టర్ కుక్ (147) భారీ శతకంతో విరుచుకుపడటం వల్ల ఇంగ్లాండ్ 423/8 వద్ద డిక్లేర్డ్ చేసింది. 464 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా.. 345 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (149), రిషభ్ పంత్ (114) శతకాలతో మెరిసినా భారత్‌ను గెలిపించలేకపోయారు.
రో'హిట్' చెలరేగిన వేళ..!
ఓవల్ మైదానంలో వరుసగా మూడు ఓటములు ఎదుర్కొన్న టీమ్‌ఇండియా.. 2021లో జరిగిన మ్యాచ్‌తో గెలుపుబాట పట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైన భారత్.. రోహిత్ శర్మ (127) శతకానికితోడు కేఎల్ రాహుల్ (46), పుజారా (61), కోహ్లీ (44) కూడా రాణిండం వల్ల రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల ఆధిక్యం సంపాదించిన ఇంగ్లాండ్.. ఉమేశ్ యాదవ్ (3/60), బుమ్రా (2/27), జడేజా (2/50), శార్దూల్ ఠాకూర్ (2/22) బంతితో మెరవడం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో 210 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమ్‌ఇండియా 157 పరుగుల తేడాతో విజయం సాధించింది. గత ఐదు మ్యాచుల్లో ఇరు జట్ల మధ్య గణాంకాలను పరిశీలిస్తే మొదటిసారి ఈ స్టేడియంలో ఆడుతున్న వీరు ఎలాగైన గెలవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు.