విరాట్ కోహ్లీ(Virat Kohli) సారథ్యంలోని టీమ్‌ఇండియా(Team India) ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) ఓడిపోయాక.. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు మధ్యలో మరో ఆరు వారాల సమయం ఉంది. అన్ని రోజుల పాటు బయో బుడగలో ఉండటం కష్టం. అందులోనూ ఆటగాళ్లు మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ నేపథ్యంలో వారిని ఉల్లాసంగా ఉంచేందుకు మూడు వారాల పాటు టీమ్‌ఇండియా క్రికెటర్లకు విరామం ఇచ్చారు. బుడగ నుంచి బయటకు వెళ్లి గడిపేందుకు అనుమతి ఇచ్చారు. జట్టులోని చాలామందికి బ్రిటన్‌లోని ప్రాంతాలతో పరిచయం ఉంది. సారథి విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మ(Anushka Sharma)తో కలిసి ఓ కెఫేకు వెళ్లి చక్కని కాఫీని ఆస్వాదించాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలను వీరిద్దరూ ఇన్‌స్టాలో పంచుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
టీమ్‌ఇండియా వన్డే, టెస్టు జట్ల వైస్ కెప్టెన్లు రోహిత్ శర్మ(Rohit Sharma), అజింక్యా రహానే(Ajinkya rahane) కుటుంబ సమేతంగా బయటకు వెళ్లారు. భార్యాబిడ్డలతో కలిసి విహరిస్తున్నారు. పిల్లలు ఎక్కువగా ఇష్టపడే పార్క్‌లు, ఆట స్థలాలకు వెళ్తున్నారు.
అలాగే ఇషాంత్ శర్మ(Ishant Sharma), మయాంక్ అగర్వాల్, అశ్విన్ వారి వారి కుటంబాలతో ఇంగ్లాండ్‌లో సరదాగా గడుపుతున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలతో నెట్టింట సందడి చేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">