ETV Bharat / sports

తండ్రిగా ప్రమోషన్ పొందిన పేసర్ భువనేశ్వర్

టీమ్ఇండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తండ్రయ్యాడు. ఇతడి సతీమణి నుపుర్ నగర్ బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

bhuvneshwar kumar becomes father, bhuvneshwar kumar father promotion, తండ్రయిన భువనేశ్వర్ కుమార్, భువనేశ్వర్​కు పండంటి బిడ్డ
భువనేశ్వర్​
author img

By

Published : Nov 24, 2021, 7:02 PM IST

Updated : Nov 24, 2021, 9:57 PM IST

Bhuvneshwar Kumar Baby: టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఇతడి భార్య నుపుర్ నగర్ బుధవారం ఉదయం 9 గంటలకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భువీ సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశాడు.

మంగళవారం వీరిద్దరూ తమ నాలుగో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ క్రమంలో నేడు ఉదయం పురుటి నొప్పులు రాగా నుపుర్​ను దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. కాసేపటికే ఆమె బిడ్డకు జన్మనివ్వగా.. వారి కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది.

ఈ ఏడాది మే 20న భువనేశ్వర్ కుమార్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ అనారోగ్యంతో మృతిచెందారు(bhuvneshwar kumar father passed away). ఆ సమయంలో వారి కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను అనుభవించిన వీరి కుటుంబంలోకి తాజాగా ఆడబిడ్డ రాగా.. ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇవీ చూడండి: నెట్స్​లో ద్రవిడ్ బౌలింగ్.. స్పిన్​తో మాయాజాలం!

Last Updated : Nov 24, 2021, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.