ETV Bharat / sports

'ఆట మార్చుకోవాలని పంత్​కు చెప్పలేం.. కానీ'

Dravid about Pant: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్ అనవసర షాట్​కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ విషయంపై స్పందించిన కోచ్ ద్రవిడ్.. షాట్ల ఎంపిక గురించి పంత్​తో చర్చిస్తామని తెలిపాడు.

Rishabh Pant news, dravid about pant, పంత్ గురించి ద్రవిడ్, పంత్ లేటెస్ట్ న్యూస్
Rishabh Pan
author img

By

Published : Jan 7, 2022, 1:22 PM IST

Dravid about Pant: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ విఫలమవ్వడంపై హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ స్పందించాడు. షాట్ల ఎంపిక గురించి అతడితో కలిసి చర్చిస్తామని చెప్పాడు. గురువారం టీమ్‌ఇండియా రెండో టెస్టులో ఓటమి పాలయ్యాక ద్రవిడ్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా పంత్‌ బ్యాటింగ్‌ తీరుపై నోరువిప్పాడు.

"పంత్ సానుకూలంగా ఉండే ఆటగాడని మనందరికీ తెలిసిందే. అతడు ఆడే వైవిధ్యమైన తీరుతోనే విజయవంతమయ్యాడు. అయితే, కొన్నిసార్లు షాట్ల ఎంపికలో ఇబ్బందిపడిన సందర్భాలూ ఉన్నాయి. ఈ విషయంపై అతడితో కలిసి చర్చిస్తాం. ఈ మ్యాచ్‌లో షాట్‌ సెలెక్షన్‌ టైమింగ్‌ సరిగ్గా లేకపోవడం వల్లే ఔటయ్యాడు. షాట్ల ఎంపిక అనేది కేవలం టైమింగ్‌కు సంబంధించిందే."

-ద్రవిడ్, టీమ్ఇండియా కోచ్

"ఎవరైనా ఆటగాడు క్రీజులోకి రాగానే కాస్త సమయం తీసుకుని పరిస్థితులను అర్థం చేసుకుని ఆడాలనుకోవడం మంచి పరిణామం. పంత్‌ విషయంలో ఏం జరుగుతుందో మేం అర్థం చేసుకున్నాం. అతడో పాజిటివ్‌ ప్లేయర్‌. తన ఆటతో మ్యాచ్‌ ఫలితాన్నే మర్చగల సమర్థుడు. అలాంటి ఆటగాడిని తన ఆట తీరు మార్చుకోవాలని మేం చెప్పలేం. సందర్భాన్ని బట్టి షాట్ల ఎంపిక ఉండాలనేది మాత్రమే సూచిస్తాం. ఎప్పుడు ఎలా అటాక్‌ చేయాలనేది వివరిస్తాం. అతడు ప్రస్తుతం నేర్చుకునే దశలో ఉన్నాడు. కచ్చితంగా నేర్చుకుంటాడు" అని ద్రవిడ్ తన ఆలోచనలు పంచుకున్నాడు.

ఇవీ చూడండి

చదరంగానికి అందం తోడైతే.. తానియా సచ్​దేవ్!

టీమ్ఇండియా మొట్టమొదటి టీ20కి కెప్టెన్ ధోనీ కాదా?.. మరెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.