Team India Bowlers Performance In South Africa Series : ఈ ఏడాది టీమ్ఇండియాలో ఎంతో మంది ప్లేయర్లు తమ సత్తా చాటి జట్టుకు భరోసాను అందించారు. అరంగేట్ర ప్లేయర్ల నుంచి సీనియర్ల వరకు తమ ఆట తీరుతో అభిమానులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బౌలింగ్ టీమ్‌లో కొంత మంది యువ పేసర్లు అద్భుతాలు సృష్టించి సీనియర్లకు విశ్రాంతి కల్పించారు. కొన్నేళ్లుగా బలహీనపడ్డ పేస్ విభాగాన్ని అన్ని తామై చూసుకుంటున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో అర్ష్‌దీప్ సింగ్, అవేష్‌ఖాన్, ముకేశ్ కుమార్ తమ బౌలింగ్‌తో జట్టుకు భరోసా ఇచ్చారు. క్లిష్టమైన పిచ్‌లపై ఆడి తామేంటో నిరూపించుకున్నారు. రానున్న సిరీసుల్లోనూ ఈ ముగ్గురూ తమ సత్తా చాటేందుకు రంగంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి పర్ఫామెన్స్ ఎలా ఉందంటే ?
భారత జట్టుకు దొరికిన ఓ పేస్ ఆణిముత్యం ముకేశ్ కుమార్. తన బౌలింగ్ స్కిల్స్‌లో మూడు ఫార్మాట్లలో అవలీలగా ఆడుతూ దూసుకెళ్తున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో సుదీర్ఘ స్పెల్స్ వేసే సత్తా అతడికి ఉంది. అందుకే ముకేశ్ కుమార్ మాత్రం మిగిలిన పేసర్ల కంటే భిన్నమంటూ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు. ఈ ఏడాది జులైలో వెస్టిండీస్‌పై టెస్టు, వన్డేల్లో అరంగేట్రం చేసిన ముకేశ్ సౌతాఫ్రికా టూర్‌లోని మూడు ఫార్మాట్లలోనూ టీమ్ఇండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మలుచుకుని ఆడగలడు. మహ్మద్ షమి లాగే రనప్ కలిగి ఉన్న ముకేశ్ స్వింగ్ పిచ్‌లపై కూడా ఓ రేంజ్లో ఆడుతాడు. రా పేస్‌కు స్వింగ్ మిక్స్ చేసి అతడు వేసే బంతులు ప్రత్యర్థులను హడలెత్తిస్తుంటుంది. దీంతో ఇతడ్ని అందరూ మహ్మద్ షమికి ప్రత్యామ్నాయం అంటూ కొనియాడుతున్నారు.
-
𝐒𝐨𝐮𝐭𝐡 𝐚𝐟𝐫𝐢𝐜𝐚 𝐯𝐢𝐜𝐡 𝐢𝐧𝐝𝐢𝐚 𝐝𝐚 𝐣𝐡𝐚𝐧𝐝𝐚 𝐥𝐞𝐡𝐫𝐚 𝐝𝐢𝐭𝐭𝐚 🇮🇳❤️
— Punjab Kings (@PunjabKingsIPL) December 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
📹: Arshdeep Singh#SAvIND #ArshdeepSingh #AveshKhan pic.twitter.com/jDLXZOfGlp
">𝐒𝐨𝐮𝐭𝐡 𝐚𝐟𝐫𝐢𝐜𝐚 𝐯𝐢𝐜𝐡 𝐢𝐧𝐝𝐢𝐚 𝐝𝐚 𝐣𝐡𝐚𝐧𝐝𝐚 𝐥𝐞𝐡𝐫𝐚 𝐝𝐢𝐭𝐭𝐚 🇮🇳❤️
— Punjab Kings (@PunjabKingsIPL) December 17, 2023
📹: Arshdeep Singh#SAvIND #ArshdeepSingh #AveshKhan pic.twitter.com/jDLXZOfGlp𝐒𝐨𝐮𝐭𝐡 𝐚𝐟𝐫𝐢𝐜𝐚 𝐯𝐢𝐜𝐡 𝐢𝐧𝐝𝐢𝐚 𝐝𝐚 𝐣𝐡𝐚𝐧𝐝𝐚 𝐥𝐞𝐡𝐫𝐚 𝐝𝐢𝐭𝐭𝐚 🇮🇳❤️
— Punjab Kings (@PunjabKingsIPL) December 17, 2023
📹: Arshdeep Singh#SAvIND #ArshdeepSingh #AveshKhan pic.twitter.com/jDLXZOfGlp
మరోవైపు ఐపీఎల్‌లో సత్తా చాటి టీమ్ఇండియాలోనూ సంచలనాలు చేస్తున్నారు అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్ ద్వయం. పంజాబ్ కింగ్స్‌కు అర్ష్‌దీప్, లఖ్‌నవూ జట్టుకు అవేశ్ ఖాన్ ఇలా ఈ ఇద్దరూ పలు కీలక ఇన్నింగ్స్‌లో జట్టుకు సహాయపడ్డారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అర్ష్‌దీప్ బౌలింగ్ చేసిన తీరు అద్భుతం అనిపిస్తుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చేసరికి అర్ష్‌దీప్, అవేశ్లు కాస్త డీలా పడ్డట్లు కనిపిస్తున్నారు. ప్రత్యర్థులకు పరుగులు ధారాళంగా ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా పవర్ ప్లేలో బంతిని కంట్రోల్‌గా వేయడం వీరికి చాలా కష్టంగా అనిపిస్తోంది. అయితే సాతాఫ్రికా సిరీస్ సమయానికి ఈ ఇద్దరూ ఫామ్‌లోకి వచ్చినట్లు అనిపించారు. ముఖ్యంగా అర్ష్‌దీప్ మూడు వన్డేల సిరీస్‌లో 10 వికెట్లు తీసి అదరగొట్టాడు. మరోవైపు అవేశ్ కూడా రాణిస్తున్నాడు. తొలి వన్డేలో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇలా బుమ్రా, షమి, సిరాజ్ లేని లోటును ఈ ముగ్గురు సమర్థంగా భర్తీ చేశారు.
-
Mukesh Kumar picks up his first wicket.
— BCCI (@BCCI) December 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Captain KL Rahul with a fine catch behind the stumps.
Miller departs for 10 runs.
Live - https://t.co/u5YB5AZvpd #SAvIND pic.twitter.com/Ua9uuktVpR
">Mukesh Kumar picks up his first wicket.
— BCCI (@BCCI) December 21, 2023
Captain KL Rahul with a fine catch behind the stumps.
Miller departs for 10 runs.
Live - https://t.co/u5YB5AZvpd #SAvIND pic.twitter.com/Ua9uuktVpRMukesh Kumar picks up his first wicket.
— BCCI (@BCCI) December 21, 2023
Captain KL Rahul with a fine catch behind the stumps.
Miller departs for 10 runs.
Live - https://t.co/u5YB5AZvpd #SAvIND pic.twitter.com/Ua9uuktVpR
-
Arshdeep Singh's incredible bowling display earned him the Player of the Series Award in the #SAvIND ODI series 🌟 pic.twitter.com/aOgPYivqBk
— ICC (@ICC) December 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Arshdeep Singh's incredible bowling display earned him the Player of the Series Award in the #SAvIND ODI series 🌟 pic.twitter.com/aOgPYivqBk
— ICC (@ICC) December 22, 2023Arshdeep Singh's incredible bowling display earned him the Player of the Series Award in the #SAvIND ODI series 🌟 pic.twitter.com/aOgPYivqBk
— ICC (@ICC) December 22, 2023
అన్క్యాప్డ్ ప్లేయర్‌పై కాసుల వర్షం.. ఎవరీ ముకేశ్ కుమార్
'నా కష్టం మీకు తెలియదు, తెలుగు కుర్రాడు అదుర్స్'- రాహుల్, అర్షదీప్ రికార్డులే రికార్డులు!