ETV Bharat / sports

IND VS NZ: రాయ్​పుర్​ చేరుకున్న టీమ్​ఇండియా.. సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం! - Team India in raipur

ఉప్పల్​ వేదికలో కివీస్​తో జరిగిన తొలి వన్డేలో చితక్కొట్టిన టీమ్​ ఇండియా.. అదే జోరుతో రెండో వన్డేకు సిద్ధమౌతోంది. ఈ క్రమంలో ఇరు జట్లు ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​కు చేరుకున్నాయి. అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది.

team india at raipur
team india at raipur
author img

By

Published : Jan 20, 2023, 12:30 PM IST

హైదరాబాద్​లోని ఉప్పల్​ వేదికగా జరిగిన తొలి వన్డే​లో కివీస్​ సేన​ను ఓడించిన టీమ్​ ఇండియా సంబరాలు చేసుకుంటోంది. ప్రస్తుతం ఫుల్​ జోష్​లో ఉన్న మనోళ్లు.. తమ రెండో మ్యాచ్‌ కోసం ఛత్తీస్‌గఢ్‌లోని మ్యాచ్​ వేదికైన రాయ్​పుర్​లోకి అడుగుపెట్టారు. ప్రత్యర్థి జట్టు కూడా అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలో ఆయా జట్లకు అక్కడ ఘన స్వాగతం లభించింది. సంప్రదాయ నృత్యల నడుమ టీమ్​ఇండియాతో పాటు న్యూజిలాండ్​ టీమ్​ను హోటల్‌ సిబ్బంది ఘనంగా ఆహ్వానించింది. కివీస్‌ జట్టుకు సైతం అదే స్థాయిలో అతిథి సత్కారాలు చేసింది.

దీనికి సంబంధించిన వీడియోలను బీసీసీఐ, బ్లాక్‌కాప్స్‌ తమ సోషల్‌ మీడియాల ఖాతాల్లో షేర్‌ చేయగా ఇప్పుడవి నెట్టింట వైరలవుతున్నాయి . కాగా మూడు వన్డే, మూడు టీ20ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా- కివీస్‌ మధ్య బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా తొలి వన్డే జరిగింది.

ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఎట్టకేలకు 12 పరుగుల తేడాతో రోహిత్​ సేన 1-0తో ఆధిక్యంలో విజయాన్ని ముద్దాడింది .ఇక ఇరు జట్ల మధ్య రాయ్‌పుర్‌లోని షాహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ అంతర్జాతీయ స్టేడియంలో రెండో మ్యాచ్‌ జరుగనుంది. ఇందుకోసం శుక్రవారం మధ్యాహ్నం నుంచే టీమ్​ ఇండియా ప్రాక్టీస్​ను ప్రారంభించనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.