Washington Sundar Record: ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు మాత్రం మరోసారి పూర్తిగా తేలిపోయారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
భారత ఇన్నింగ్స్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుందర్ కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు సాధించాడు. తద్వారా సుందర్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై అత్యంత వేగంగా 30కు పైగా పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా సుందర్ నిలిచాడు
అంతకుముందు ఈ రికార్డు టీమ్ఇండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా పేరిట ఉండేది. 2009లో బ్లాక్ క్యాప్స్‌పై 18 బంతుల్లో 38 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో సుందర్ రైనా రికార్డును బ్రేక్ చేశాడు. ఇక న్యూజిలాండ్, భారత్ మధ్య రెండో వన్డే హామిల్టన్ వేదికగా నవంబర్ 27న జరగనుంది.