ETV Bharat / sports

WTC Final: టీ సమయానికి 120/3తో కోహ్లీసేన

author img

By

Published : Jun 19, 2021, 7:59 PM IST

Updated : Jun 19, 2021, 8:11 PM IST

సౌథాంప్టన్ వేదికగా కివీస్​తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్​లో టీ సమయానికి టీమ్ఇండియా 3 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్​ కోహ్లీతో పాటు రహానె ఉన్నారు. కివీస్ బౌలర్లలో జేమీసన్, వాగ్నర్, బౌల్ట్ తలో వికెట్ తీసుకున్నారు.

wtc final, tea break
డబ్ల్యూటీసీ ఫైనల్, విరాట్ కోహ్లీ

సౌథాంప్టన్ వేదికగా కివీస్​తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్​లో టీ సమయానికి టీమ్ఇండియా 3 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్​ కోహ్లీ(94 బంతుల్లో 35 పరుగులు), రహానె(54 బంతుల్లో 13 పరుగులు) ఉన్నారు. కివీస్ బౌలర్లలో జేమీసన్, వాగ్నర్, బౌల్ట్ తలో వికెట్ తీసుకున్నారు.

68/2తో లంచ్​కు వెళ్లిన భారత్​ రెండో సెషన్​లో పుజారా వికెట్​ను కోల్పోయింది. అద్భుతమైన బంతితో నయా వాల్​ను బోల్తా కొట్టించాడు ట్రెంట్ బౌల్ట్. ఆ తర్వాత ఆచితూచి ఆడింది కోహ్లీ-రహానె జంట. సింగిల్స్, డబుల్స్​తో స్కోరు బోర్డుకు ఒక్కో పరుగు జోడించారు. నాలుగో వికెట్​కు ఈ ద్వయం 32 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. టీ విరామానికి ముందు మరో వికెట్ పడకుండా వీరిద్దరు జాగ్రత్త పడ్డారు.

శుభారంభం..

వర్షం కారణంగా తొలి రోజు తుడిచిపెట్టుకుపోగా.. రెండో రోజు ఆట ప్రారంభమైంది. టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కోహ్లీసేన శుభారంభం చేసింది. తొలి వికెట్​కు ఓపెనర్లు రోహిత్ శర్మ(68 బంతుల్లో 34), శుభ్​మన్ గిల్(64 బంతుల్లో 28).. 62 పరుగులు జోడించారు. కుదురుకుంటున్నట్టే కనిపించిన ఈ జంటను జేమీసన్​ విడగొట్టాడు. రోహిత్​ను స్లిప్​లో దొరకబుచ్చుకున్నాడు. గిల్​ కూడా వికెట్​కీపర్​కు చిక్కాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది టీమ్ఇండియా.

నల్ల బ్యాడ్జీలతో..

అంతకుముందు.. భారత దిగ్గజ స్ప్రింటర్​ మిల్కా సింగ్(Milkha Singh) మృతికి సంతాపం ప్రకటించారు టీమ్ఇండియా ఆటగాళ్లు. ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్(WTC Final)​ సందర్భంగా జాతీయ గీతం పాడిన భారత ఆటగాళ్లు.. చేతులకు నల్లరిబ్బన్లను ధరించారు.

గత రెండు నెలలుగా కొవిడ్​తో బాధపడుతున్న మిల్కా సింగ్ ఇటీవల మహమ్మారి నుంచి కోలుకున్నారు. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా తీవ్ర జ్వరంతో పాటు ఆక్సిజన్​ స్థాయిలు పడిపోయాయి. దీంతో రాత్రి 11.30 సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. కరోనా బాధపడుతూ ఆయన భార్య నిర్మలా కౌర్​ గత ఆదివారం కన్నుమూశారు.

ఇదీ చదవండి: MS Dhoni: ధోనీ నయా లుక్​- ఎగబడ్డ ఫ్యాన్స్​

Last Updated : Jun 19, 2021, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.