Tamim Iqbal Retired : బంగ్లాదేశ్ జట్టు సారథి, స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ తాజాగా ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అన్ని క్రికెట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లుగా అతడు గురువారం ప్రకటించాడు. ప్రపంచకప్ సమరానికి సిద్ధమవ్వాల్సిన తరుణంలో తమీమ్ ఇలా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం ఆ దేశ క్రికెట్ బోర్డును ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. అయితే బుధవారం బంగ్లాదేశ్‌లోని జాహుర్ అహ్మద్ చౌదరీ స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో బంగ్లా జట్టు ఓడిపోయిన కొన్ని గంటలకే తమీమ్ ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో అన్ని ఫార్మాటల్లో కలిపి మొత్తం 389 మ్యాచ్‌లాడిన ఈ స్టార్ ఆటగాడు.. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
-
Tamim Iqbal - The leading run-scorer for Bangladesh across all formats.#Cricket #TamimIqbal #CricTracker pic.twitter.com/965VVOjn3b
— CricTracker (@Cricketracker) July 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tamim Iqbal - The leading run-scorer for Bangladesh across all formats.#Cricket #TamimIqbal #CricTracker pic.twitter.com/965VVOjn3b
— CricTracker (@Cricketracker) July 6, 2023Tamim Iqbal - The leading run-scorer for Bangladesh across all formats.#Cricket #TamimIqbal #CricTracker pic.twitter.com/965VVOjn3b
— CricTracker (@Cricketracker) July 6, 2023
తమీమ్ ఇక్బాల్ ట్రాక్ రికార్డ్..
ఫార్మాట్ | మ్యాచులు | పరుగులు | సెంచరీలు | హాఫ్ సెంచరీలు | టాప్ స్కోర్ |
టెస్టులు | 70 | 5134 | 10 | 31 | 206 |
వన్డేలు | 241 | 8313 | 14 | 56 | 158 |
టీ20లు | 78 | 1758 | 1 | 7 | 103* |
కన్నీరు పెట్టిన కెప్టెన్..!
Bangladesh vs Afghanistan ODI : మొత్తం మూడు ఫార్మాటుల్లో కలిపి బంగ్లాదేశ్ జాతీయ జట్టు తరఫున తమీమ్ 15,205 పరుగులు సాధించి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. 16 ఏళ్ల తన క్రికెట్ కెరీర్లో తనక సపోర్ట్ చేసిన అభిమానులతో పాటు బంగ్లా క్రికెట్ బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ కంటతడి పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సిన తరుణం వచ్చిందని వ్యాఖ్యానించాడు. తమీమ్ ఇక్బాల్ స్థానంలో కొత్త కెప్టెన్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇంకా ప్రకటించలేదు. అయితే మళ్లీ షకిబ్ అల్ హసన్‌కు గానీ లిటన్ దాస్‌కు కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఉన్నాయి. బంగ్లా-అఫ్గానిస్థాన్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే జులై 8న, మూడో వన్డే జులై 11న జరగనుంది.
" దీంతో నా క్రికెట్ కెరీర్ ముగిసింది. అన్ని ఫార్మాటుల్లో నా అత్యుత్మమ ప్రదర్శనను ఇచ్చాను. ఇక అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. ఇన్నేళ్ల నా లాంగ్ జర్నీలో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరున థ్యాంక్స్."
- తమీమ్ ఇక్బాల్, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్
Tamim Iqbal Career : బంగ్లాదేశ్ తరఫున 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన తమీమ్ ఇక్బాల్ కొద్దికాలంలోనే స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. అదే ఏడాదే జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించడంలో తమీమ్ కీలక పాత్ర పోషించాడు. గతేడాది ఇదే సమయంలో అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయంగా ప్రస్తుతం యాక్టివ్ క్రికెటర్లలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు తమీమ్ కావడం విశేషం. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా తమీమ్ పేరిట రికార్డు ఉంది.
-
An icon of Bangladesh cricket 🇧🇩
— ESPNcricinfo (@ESPNcricinfo) July 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Tamim Iqbal announces his international retirement 👉 https://t.co/47EUHy1XmB pic.twitter.com/N587NJRcWI
">An icon of Bangladesh cricket 🇧🇩
— ESPNcricinfo (@ESPNcricinfo) July 6, 2023
Tamim Iqbal announces his international retirement 👉 https://t.co/47EUHy1XmB pic.twitter.com/N587NJRcWIAn icon of Bangladesh cricket 🇧🇩
— ESPNcricinfo (@ESPNcricinfo) July 6, 2023
Tamim Iqbal announces his international retirement 👉 https://t.co/47EUHy1XmB pic.twitter.com/N587NJRcWI