ETV Bharat / sports

T20 World Cup: చెదిరిన ఫైనల్ కల.. నాకౌట్​లో టీమ్​ఇండియా ఔట్.. 10వికెట్లతో ఇంగ్లాండ్ విన్ - t20 worldcup latest news

T20 World Cup Ind Vs Eng: టీ20 ప్రపంచకప్​ నాకౌట్​ దశలో టీమ్​ఇండియా నిష్క్రమించింది. భారత్​తో జరిగిన సెమీఫైనల్​ మ్యాచ్​లో ఇంగ్లాండ్​ పది​ వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆ​ జట్టు ఫైనల్​కు చేరింది.

t20 worldcup semifinal 2  india vs england won by wickets

author img

By

Published : Nov 10, 2022, 4:33 PM IST

Updated : Nov 10, 2022, 4:42 PM IST

T20 World Cup Ind Vs Eng: టీమ్‌ఇండియా అభిమానులకు నిరాశే మిగిలింది. ఈసారి ఎలాగైనా టైటిల్‌ గెలుస్తుందనుకున్న రోహిత్‌ సేన ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌ పోరులో ఓడిపోయి ఇంటిముఖం పట్టింది. ఇంగ్లాండ్​ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ అలవోకంగా ఛేదించేసింది. ఓపెనర్లు హేల్స్​, బట్లర్ ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు తీర్చారు. దీంతో ఫైనల్​ చేరిన ఇంగ్లాండ్​.. పాకిస్థాన్​తో ఆదివారం తలపడనుంది.

టీమ్​ఇండియా నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్​ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అలెక్స్​ హేల్స్(86*)​, జోస్​ బట్లర్(80*)​ సిక్సులు, ఫోర్​లతో రెచ్చిపోయారు. టీమ్​ఇండియా బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. ఇంకా నాలుగు ఓవర్లు మిగలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించేశారు.

అంతకుముందు బ్యాటింగ్​కు దిగిన భారత్​ ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్య (63) దూకుడుగా ఆడేశాడు. విరాట్ కోహ్లీ (50) మరోసారి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ (27) ఫర్వాలేదనిపించినా ధాటిగా ఆడలేకపోయాడు. కేఎల్ రాహుల్ (5), రిషభ్‌ పంత్ (6), సూర్యకుమార్ (14) పెద్దగా రాణించలేదు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో క్రిస్ జొర్డాన్ 3.. క్రిస్‌ వోక్స్, అదిల్‌ రషీద్‌ చెరో వికెట్‌ తీశారు.

Last Updated : Nov 10, 2022, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.