ETV Bharat / sports

భారత్​-పాక్ మ్యాచ్ బ్లాక్‌బస్టర్ రికార్డ్​.. ఇదే తొలిసారి

టీ20 వరల్డ్‌కప్‌ 2022లో భాగంగా భారత్‌-పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ఓ సూపర్​ రికార్డు సాధించింది. అదేంటంటే..

T20 worldcup ind pak match
భారత్​-పాక్ మ్యాచ్ వ్యూయర్ షిప్​
author img

By

Published : Oct 24, 2022, 8:14 AM IST

Updated : Oct 24, 2022, 9:12 AM IST

టీ20 వరల్డ్‌కప్‌ 2022లో భాగంగా నరాలు తెగే ఉత్కంఠతో సాగిన భారత్‌-పాక్‌ మ్యాచ్​లో విరాట్‌ వీరోచితంగా పోరాడి జట్టుకు మరపురాని విజయాన్నందించాడు. అయితే ఈ మ్యాచ్‌ వ్యూయర్షిప్​ పరంగా ఓ సూపర్​ రికార్డును సాధించింది. రికార్డు వ్యూయర్‌షిప్‌తో సరికొత్త చరిత్ర లిఖించింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ హాట్ స్టార్స్ గత రికార్డులన్నిటినీ బ్రేక్ చేస్తూ ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది.

ఈ మ్యాచ్​ను డిజిటల్‌ ప్లాట్‌ఫాంపై ఏకంగా కోటి 80 లక్షల మంది వీక్షించారు. డిజిటల్‌ ప్లాట్‌ఫాం చరిత్రలో ఇదే అత్యధికం. ఈ ఏడాది ఆసియా కప్‌లో జరిగిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు కోటి 30 లక్షల వ్యూస్‌ లభించగా.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఆ రికార్డును బ్రేక్‌ చేసి డిజిటల్‌ ప్లాట్‌ఫాంపై సరికొత్త చరిత్ర సృష్టించింది.

కాగా, చివరి నిమిషం నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ సమరంలో టీమ్​ఇండియా.. దాయాది పాక్‌ను 4 వికెట్ల తేడాతో మట్టికరిపించి, ఆసియా కప్‌-2022, గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవాలకు ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ విశ్వరూపం (53 బంతుల్లో 82 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రదర్శించి ఛేదనలో రారాజు తనేనని మరోసారి ప్రపంచానికి చాటాడు. కోహ్లి వీరోచిత పోరాటానికి హార్దిక్​ పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన (40, 3/30) తోడవ్వడం వల్ల భారత్‌ అపురూప విజయాన్ని అందుకుంది.

ఇదీ చూడండి: T20 worldcup: కోహ్లీ.. కింగ్‌ ఎక్కడున్న కింగే..

Last Updated : Oct 24, 2022, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.