ETV Bharat / sports

నెదర్లాండ్స్​తో రెండో మ్యాచ్​.. కోహ్లీ-కార్తిక్​.. రోహిత్​-రాహుల్​ స్పెషల్ ప్రాక్టీస్​ - teamindia netherlands practice match

పాకిస్థాన్​పై విజయం సాధించి రెట్టింపు ఉత్సాహంతో ఉన్న టీమ్​ఇండియా నెదర్లాండ్స్​తో జరగబోతున్న తమ తదుపరి మ్యాచ్​ కోసం సిద్ధమవుతోంది. ఇందుకోసం తాజాగా ఆటగాళ్లంతా ఎంతో హుషారుగా ప్రాక్టీస్​ సెషన్​లో పాల్గొన్నారు.

T20 worldcup
నెట్స్​లో టీమ్​ఇండియా
author img

By

Published : Oct 25, 2022, 1:34 PM IST

Updated : Oct 25, 2022, 3:47 PM IST

టీ20 వరల్డ్ కప్​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా అపురూప విజయాన్ని అందుకుంది. ఇప్పుడదే ఉత్సాహంతో నెదర్లాండ్స్​తో పోరుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఆటగాళ్లు సిడ్నీ క్రికెట్​ గ్రౌండ్​లో తమ తొలి నెట్​ సెషన్​ను పూర్తి చేశారు. ఈ సెషన్​లో కెప్టెన్​ రోహిత్​ శర్మ, కేఎల్ రాహుల్​, కోహ్లీ, పంత్​, చాహల్​ సహా పలువురు ప్లేయర్స్ హుషారుగా పాల్గొన్నారు. అయితే సూర్యకుమార్ యాదవ్​, హార్దిక్ పాండ్య, షమీ, భువనేశ్వర్​ కుమార్​, అర్షదీప్ సింగ్​ మాత్రం విశ్రాంతి తీసుకున్నారు.

ఈ ప్రాక్టీస్​లో బౌలర్లు, బ్యాటర్లు తీవ్రతతో ఆడారు. అశ్విన్​-చాహల్​ బౌలింగ్​లో రాహుల్​-దినేశ్ కార్తిక్​ బంతులను ఎదుర్కొన్నారు. అలాగే కార్తి.. కోహ్లీ కలిసి త్రో-డౌన్స్​ ప్రాక్టీస్ చేశాడు. పాక్​తో మ్యాచ్​లో విఫలమైన రోహిత్ శర్మ-రాహుల్​ క్రిస్ప్​ డ్రైవ్స్ బాగా​ ప్రాక్టీస్ చేశారు. పంత్​ కూడా నెట్స్​లో మంచి షాట్లు ఆడుతూ కనిపించాడు. మొత్తంగా ఈ ప్రాక్టీస్ సెషన్ అంతా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ పర్యవేక్షణలో జరిగింది.

ఇదీ చూడండి: కోహ్లీ ఎఫెక్ట్​.. దెబ్బకు యూపీఐ లావాదేవీలు ఢమాల్

Last Updated : Oct 25, 2022, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.