ETV Bharat / sports

T20 worldcup: అప్పుడు పాక్​కు ఇప్పుడు టీమ్​ఇండియాకు ఒకేలా జరిగిందిగా! - తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో భారత్​ ఓడిపోయింది

ఈ సారి టీ20 ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. అయితే ఈ మెగాటోర్నీలో గతేడాది టీమ్ఇండియాకు పట్టిన గతే ఈ సారి పాకిస్థాన్​కు ఎదురైంది. అదేంటంటే..

భారత్​ పాకిస్థాన్​
india and pakisthan
author img

By

Published : Oct 31, 2022, 8:27 PM IST

ఈ సారి టీ20 వరల్డ్​ కప్​ రసవత్తరంగా సాగుతోంది. పసి కూనలని తేలికగా తీసుకున్న జట్లు మహామహులని ఓడిస్తున్నాయి. ఫామ్​లో లేరన్న ప్లేయర్లు బంతుల్ని బౌండరీలు దాటిస్తున్నారు. ఇక ఫామ్​లో ఉన్న వారు ఆ స్థాయిలో ఆడలేక వెనుదిరుగుతున్నారు. ఇకపోతే ఈ టోర్నీలో గతసారి భారత్​కు పట్టుకున్న ఈ సారి పాకిస్థాన్​కు పట్టినట్లు కనిపిస్తోంది. అదెలాగంటే..

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్​ కప్​లో వరుసగా రెండు విజయాలను అందుకున్న టీమ్​ఇండియాకు తొలి పరాజయం ఎదురైంది. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. దీంతో పాకిస్థాన్​కు సెమీస్ అవకాశాలు గల్లంతయ్యాయి. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్​ఇండియా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో రోహిత్ సేనకు వచ్చే ఇబ్బంది పెద్దగా ఏం లేకున్నా.. పాకిస్థాన్ జట్టుకు మాత్రం తీవ్ర నష్టం జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి ఉంటే.. పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశాలు ఉండేవి. తదుపరి రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన రన్ రేట్ సాధిస్తే ఆ జట్టు నాకౌట్ దశకు చేరేది. కానీ దక్షిణాఫ్రికా గెలవడం వల్ల పాక్​కు ఛాన్స్ లేకుండా పోయింది. ఇక పాక్​కు ఉన్న ఒకే ఒక అవకాశం.. భారత్​ వరల్డ్​ కప్​ నుంచి వైదొలగడమే.

యాదృచ్ఛికం అంటే ఇేదే కాబోలు.. అందుకే గత వరల్డ్​ కప్​లో టీమ్​ఇండియాకు పట్టిన గతే ఈసారి పాకిస్థాన్‌కు పట్టింది. దుబాయ్ వేదికగా భారత్ నిర్వహించిన ఆ టోర్నీలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్​ లీగ్ దశలోనే టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. మొదటి మ్యాచ్​లో ఓడిపోయిన భారత జట్టు.. రెండో మ్యాచ్​లోనూ న్యూజిలాండ్​ చేతులో ఓడి సెమీస్ అవకాశాలను గల్లంతు చేసుకుంది. అనంతరం న్యూజిలాండ్‌పై అఫ్గానిస్థాన్‌ గెలవాలని కోరుకున్నా.. అది జరగలేదు. తర్వాతి మ్యాచ్‌ల్లో అఫ్గాన్, నమీబియా, స్కాట్లాండ్‌ను ఓడించినా.. నాకౌట్‌కు చేరలేకపోయింది. అప్పుడు భారత గ్రూప్‌లో ఉన్న పాకిస్థాన్, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి.

పాక్​కు విపత్కర పరిస్థితి.. తాజాగా జరుగుతున్న ప్రపంచకప్‌లో పాకిస్థాన్ విపత్కర పరిస్థితి ఎదుర్కొంటుంది. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిన బాబర్ సేన.. రెండో మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. మూడో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై గెలిచినా.. సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోవడంతో ఆ జట్టు ఆశలు గల్లంతయ్యాయి. తదుపరి మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌పై గెలిచినా పాక్ ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. గతేడాది భారత అభిమానులు లెక్కలేసుకున్నట్లే ఈ సారి పాక్ అభిమానులు సెమీస్ సమీకరణాలు పరిశీలిస్తున్నారు. మొత్తానికి రెండు దాయాదీ దేశాలకు ఒకే పరిస్థితి ఎదురవ్వడం గమ్మత్తైన విషయమని కామెంట్స్​ చేస్తున్నారు.

భారత్‌కు సెమీస్ గండం.. గతేడాది గ్రూప్ టాపర్‌గా సెమీస్ చేరిన పాకిస్థాన్.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ సారి భారత్ కూడా పాకిస్థాన్‌ తరహాలోనే సెమీస్‌లోనే వెనుదిరుగుతుందా? అనే ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. నాకౌట్స్‌లో భారత్‌కు గండంలా తయారైన న్యూజిలాండ్‌తోనే భారత్ తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పాక్​కు సెమీస్​ ఛాన్స్​.. గ్రూప్-2లో మూడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించిన పాకిస్థాన్ 2 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. రన్‌రేట్ కూడా మెరుగ్గా లేదు. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే.. తన చివరి రెండు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై భారీ విజయాలు సాధించాలి. అంతే కాకుండా భారత్.. బంగ్లా చేతిలో ఓడి, జింబాబ్వేపై తక్కువ మార్జిన్‌తో గెలిస్తే... మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా పాక్ టాప్-2లో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికైతే పాక్ కంటే భారత్‌కు మెరుగైన నెట్ రన్‌రేట్ ఉంది. పాకిస్థాన్‌ను సౌతాఫ్రికా ఓడిస్తే చాలు.. దాయాది సెమీస్ రేసు నుంచి వైదొలిగినట్టే. ఈ నేపథ్యంలో నవంబర్ 3న దక్షిణాఫ్రికా, పాక్ మధ్య జరిగే మ్యాచ్ కీలకం కానుంది.

ఇదీ చదవండి: హోటల్​ రూమ్​ వీడియో లీక్​.. విరాట్​ కోహ్లీ, అనుష్క ఫుల్​ సీరియస్​

'రక్షిస్తారనుకుంటే ఇలా చేశారేంటి?'.. టీమ్ఇండియా ఆటపై షోయబ్ అక్తర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.