ETV Bharat / sports

T20 World Cup: గుడ్​న్యూస్​.. స్డేడియాల్లో ప్రేక్షకులకు అనుమతి

author img

By

Published : Oct 4, 2021, 8:17 AM IST

Updated : Oct 4, 2021, 8:52 AM IST

యూఏఈ(t20 world cup 2021 venue) వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్​ను అభిమానులు ప్రత్యక్షంగా చూసేందుకు వీలు కల్పించింది ఐసీసీ. స్టేడియం సామర్థ్యంలో 70శాతం మంది ప్రేక్షకులకు అనుమతించనున్నట్లు తెలిపింది.

t20
టీ 20

క్రికెట్​ అభిమానులకు తీపి కబురు. యూఏఈ(t20 world cup 2021) వేదికగా అక్టోబర్​ 17 నుంచి జరగబోయే టీ20 ప్రపంచకప్​ను ప్రత్యక్షంగా చూసేందుకు స్డేడియాల్లోకి ప్రేక్షకుల్ని అనుమతించనున్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు క్రికెట్​ సహా ఆయా క్రీడల నిర్వాహణ వీక్షకులు లేకుండానే లేదా స్టేడియం సామర్థ్యంలో 50శాతం మంది ఫ్యాన్స్​ నడుమ జరిపారు. ఇప్పుడు వైరస్​ తగ్గుముఖం పట్టడం వల్ల ప్రేక్షకుల అనుమతికి మార్గం మరింత సుగమమైంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్​ కోసం మైదానాల సామర్థ్యంలో 70శాతం మంది అభిమానులకు అనుమతించనున్నట్లు ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్​. టికెట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ మ్యాచ్​లను నిర్వహించనున్నట్లు తెలిపింది.

"ఒమన్​, యూఏఈ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్​కు అభిమానులను అనుమతించడం ఆనందంగా ఉంది. ఈ విషయంలో ప్రోత్సహించిన.. ప్రపంచకప్​ను నిర్వహిస్తున్న బీసీసీఐ, ఆతిథ్యమివ్వనున్న ఎమిరేట్స్, ఒమన్​​ క్రికెట్​ బోర్డు సహా స్థానిక ప్రభుత్వాలకు ధన్యవాదాలు. ఈ మెగాటోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం."

-ఐసీసీ

అక్టోబర్​ 17 నుంచి నవంబరు 14వరకు టీ20 ప్రపంచకప్​కు జరగనుంది. ఈ మెగా టోర్నీలో భారత్​ జట్టుకు మెంటార్​గా మాజీ సారథి ధోనీని నియమించారు.

టీమ్ఇండియా స్క్వాడ్​:(t20 world cup 2021 indian team)

విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), రోహిత్​ శర్మ(వైస్​ కెప్టెన్​), కేఎల్ రాహుల్​, సూర్య కుమార్ యాదవ్​, రిషబ్​ పంత్​(వికెట్ కీపర్​), ఇషాన్​ కిషన్​(వికెట్​ కీపర్), హార్దిక్​ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్​ చాహర్​, రవిచంద్రన్​ అశ్విన్​, అక్షర్​ పటేల్​, వరుణ్​ చక్రవర్తి, జస్ప్రిత్​ బుమ్రా, భువనేశ్వర్​ కుమార్​, మహ్మద్​ షమీ.

స్టాండ్​బై ప్లేయర్స్​: శ్రేయస్​ అయ్యర్​, శార్దూల్​ ఠాకూర్​, దీపక్​ చాహర్​.

ఇదీ చూడండి: T20 World Cup: భారత టీ20 ప్రపంచకప్​ జట్టు.. మెంటార్​గా ధోనీ

Last Updated : Oct 4, 2021, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.