ETV Bharat / sports

కప్పుకు రెండు అడుగుల దూరంలో నాలుగు జట్లు.. ఫైనల్​ చేరెదెవరో? - T20 world cup latest news

T20 World Cup: టీ20 ప్రపంచ కప్​లో లీగ్ మ్యాచ్​లు ముగిశాయి. గత ప్రపంచ కప్ మ్యాచ్​లతో పోలిస్తే ఈసారి చివరి మ్యాచ్ వరకూ సెమీ ఫైనల్స్​లో బెర్తులు ఖరారు కాకపోవడం వల్ల ఆట ఉత్కంఠభరితంగా సాగింది. కప్పును ఒడిసి పట్టేందుకు సెమీ ఫైనల్స్​కు చేరుకున్న నాలుగు జట్లు సర్వశక్తులా ప్రయత్నించేందుకు సిద్ధమవుతున్నాయి.

T20 world cup semi finals
టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్
author img

By

Published : Nov 6, 2022, 8:23 PM IST

T20 World Cup Semis Finals: టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ బెర్తుల ఖరారుతో అసలైన సమరానికి తెరలేచింది. దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్‌ సంచలన విజయంతో సెమీఫైనల్‌కు దూసుకొచ్చిన పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్‌ దశలో ఆడిన అయిదు మ్యాచుల్లో నాలుగు విజయాలతో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన టీమ్​ఇండియా, ఇంగ్లండ్‌తో తలపడనుంది. కప్పును ఒడిసి పట్టేందుకు రెండడుగుల దూరంలోనే ఉన్న నాలుగు ప్రధాన జట్లు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతున్నాయి.

టీ20 ప్రపంచకప్‌లో లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాయి. గత ప్రపంచకప్‌లకు భిన్నంగా చివరి మ్యాచ్‌ వరకూ సెమీఫైనల్‌ బెర్తులు ఖరారు కాకపోవడం ఉత్కంఠను కలిగించింది. లీగ్‌ దశలో చివరి రోజు మ్యాచ్‌లతో సెమీఫైనల్‌ బెర్తులపై స్పష్టత వచ్చింది. గ్రూప్‌ 1 నుంచి న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ 7 పాయింట్లతో సెమీఫైనల్‌ చేరుకున్నాయి. ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఏడు పాయింట్లే ఉన్నా, నెట్‌ రన్‌రేట్‌ తక్కువగా ఉండడం వల్ల ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు.

ఆడిన అయిదు మ్యాచుల్లో కివీస్‌ మూడు మ్యాచ్‌లు గెలిచి, ఒకటి ఓడిపోయింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కీలక విజయం సాధించిన ఇంగ్లండ్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మొత్తం 5 మ్యాచ్‌లో మూడు గెలిచిన బ్రిటిష్‌ జట్టు ఒక దాంట్లో ఓడిపోగా, మరో మ్యాచ్‌ రద్దయింది. గ్రూప్‌ 1లో న్యూజిలాండ్‌ అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది. గ్రూప్ 2లో సెమీఫైనల్‌ బెర్తులు తేలిగ్గా ఖరారు అవుతాయని అంతా భావించారు.

కానీ లీగ్‌ మ్యాచ్‌ల చివరి రోజు దాకా ఏ జట్టు, సెమీఫైనల్‌ బెర్తులు ఖరారు కాలేదు. తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ సంచలనం సృష్టించడం వల్ల దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌ ఆశలు గల్లంతయ్యాయి. ఈ ఓటమితో ప్రొటీస్‌ ఇంటి దారి పట్టగా, టీమ్​ఇండియాకు సెమీఫైనల్‌ బెర్తు ఖారారైంది. దక్షిణాఫ్రికా ఓటమితో పాకిస్థాన్‌కు అనుకోని వరం దక్కింది. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన పాక్ సెమీఫైనల్‌కు దూసుకొచ్చింది.

ఇటు పసికూన జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమ్​ఇండియా గ్రూప్‌ 2లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం ఎనిమిది పాయింట్లతో గ్రూప్‌ 2లో రోహిత్‌ సేన తొలి స్థానంలో నిలవగా, ఆరు పాయింట్లతో పాకిస్థాన్‌ రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌ చేరాయి. పొట్టి ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ సమరాలు మరింత ఉత్కంఠగా మారాయి. గ్రూప్‌ 1లో అగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌, గ్రూప్‌-2లో రెండో స్థానంలో నిలిచిన పాకిస్థాన్​తో తొలి సెమీఫైనల్‌ ఆడనుంది. తొమ్మిదో తేదీన సిడ్నీ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది.

గ్రూప్‌ 2లో అగ్రస్థానంలో నిలిచిన టీమ్​ఇండియా గ్రూప్ 1లో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్‌తో తలపడనుంది. నవంబర్‌ పదో తేదీన ఆడిలైడ్‌ వేదికగా భారత్‌-బ్రిటిష్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఎలాంటి సంచలనాలకు చోటు లేకుండా నాలుగు అగ్రశ్రేణి జట్లే సెమీస్‌ చేరుకోవడం వల్ల ఈసారి మ్యాచ్‌లు ఉత్కంఠగా జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.