T20 World Cup India Squad : 2023లో వన్డే వరల్డ్ ఫైనల్లో ఓడి త్రుటిలో మెగా టోర్నీ చేజార్చుకున్న టీమ్ఇండియా, ఈ ఏడాది జూన్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ టైటిల్ ఎలాగైనా సాధించాలని పట్టుదలతో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అంతకుముందు అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్ ఆడే జట్టు ఎంపిక కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. అఫ్గానిస్థాన్ సిరీస్‌కు జట్టును ప్రకటించే ముందు టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సహా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో సెలక్షన్ కమిటీ చర్చలు జరపనుంది. అంతేకాకుండా ఐపీఎల్లో దాదాపు 30 మంది ప్లేయర్ల ప్రదర్శనను ఈ కమిటీ పరిశీలించనుంది.
2022 టీ20 వరల్డ్‌కప్ భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరిసారి రోహిత్, కోహ్లీ కనిపించారు. అప్పటి నుంచి ఈ పొట్టి ఫార్మాట్లో ఈ స్టార్లు ఆడలేదు. అయితే జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరగబోయే సిరీస్‌లో వీరిద్దరిని తీసుకుంటారా లేదా ఐపీఎల్‌లోనే వీరి ఫామ్‌ను టెస్ట్ చేస్తారా అనేది వేచి చూడాలి.
టీ20 వరల్డ్‌కప్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య ఇద్దరూ ఫిట్‌గా లేరని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అఫ్గానిస్థాన్ సిరీస్‌తో ఏదీ తేలదని చెప్పారు. ఐపీఎల్ మొదటి నెల ప్రదర్శన ఆధారంగానే ప్రతి విషయం నిర్ణయిస్తారని అన్నారు.
2024 ICC Mens T20 World Cup : 2024 వరల్డ్‌కప్ ఈ ఏడాది జూన్ 4 నుంచి 30 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్ కోసం ఆయా జట్ల ఇప్పటికే సన్నద్ధత ప్రారంభించాయి. ఇక టోర్నీలో ఈ ఎడిషన్‌లో 20 జట్లు తలపడనున్నాయి. ఈ 20 జట్లను 5 గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇక గత 13 ఏళ్లుగా ఐసీసీ టోర్నమెంట్లో ఛాంపియన్‌గా నిలవని టీమ్ఇండియా, పొట్టి కప్పును సీరియస్‌గా తీసుకుంది.
టీ20 వరల్డ్‌కప్ లోగో రిలీజ్ - బ్యాట్ బాల్, ఎనర్జీ అంటూ ఇంట్రెస్టింగ్ వీడియో ఔట్
ఐసీసీ టోర్నీలో మరోసారి నిరాశ.. సెమీస్‌లో భారత్ ఓటమి.. ఫైనల్‌కు ఆసీస్