రానున్న టీ20 ప్రపంచకప్‌పై ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పందించాడు. టైటిల్ ఫెవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగుతున్న తమకు నిలకడే అతిపెద్ద బలమని పేర్కొన్నాడు.
టీ20 ఫార్మాట్లో మాకు అతిపెద్ద బలం స్థిరత్వం. గత రెండేళ్లుగా నిలకడైన ఆటతీరును ప్రదర్శించాం. టీ20ల్లో కొద్దిలో ఆట మారిపోతుంది. మా గ్రూపులో ఉన్న జట్లన్నీ బలమైనవే. ప్రతి మ్యాచ్ మాకు చాలా ముఖ్యమైనది.
-ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్ కెప్టెన్.
నిలకడతో పాటు యూఏఈలో వీలైనంత వేగంగా ఆడటానికి ప్రయత్నించడం చాలా ముఖ్యమని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై కాకుండా వేరే దేశంలో టోర్నీ జరగనుండటం వల్ల అక్కడి పరిస్థితులకు తొందరగా అలవాటు పడటం అవసరమని పేర్కొన్నాడు. ఇప్పటికే ఇంగ్లాండ్ 2010లో టీ20 ప్రపంచకప్, 2019లో వన్డే ప్రపంచకప్‌ను గెలుపొందిందని తెలిపాడు.
చివరగా 2016లో జరిగిన టీ20 ఫైనల్‌ను గుర్తు చేసుకున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్. ఆ మ్యాచ్‌లో తృటిలో విజయాన్ని కోల్పోయింది ఇంగ్లాండ్. చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లు బాది తమ రెండో టైటిల్ ఆశలపై నీళ్లు చల్లాడు విండీస్ బ్యాట్స్‌మన్ కార్లోస్ బ్రాత్‌వైట్.
ఇదీ చదవండి: సిరాజ్.. హైదరాబాద్ రజనీకాంత్- భారీ కటౌట్ ఏర్పాటు