ETV Bharat / sports

T20 World Cup విరాట్​ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తిన పాక్​ మీడియా! - టీమ్ ఇండియా టీ20 వరల్డ్​ కప్

T20 World Cup : ఆదివారం నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్​లో పాకిస్థాన్​పై భారత్​ గెలిచింది. ఇందులో సూపర్ ఇన్నింగ్స్​ ఆడిన కోహ్లీని యావత్​ దేశం కొనియాడింది. ఇదే కాకుండా పాక్​ మీడియా కూడా విరాట్​ను పొగడ్తలతో ముంచెత్తింది. పాక్​ పత్రికలు ఏమన్నాయంటే..

t20 world cup 2022 pakistan media hailed virat kohli

author img

By

Published : Oct 24, 2022, 7:34 PM IST

Updated : Oct 24, 2022, 8:03 PM IST

T20 World Cup : చివరి ఓవర్లో అంపైర్ల నిర్ణయాలపై అసంతృప్తి ఉన్నా.. కోహ్లీ అద్భుతంగా ఆడి టీమ్‌ ఇండియాను గెలిపించాడని పాక్‌ మీడియా పొగడ్తల వర్షం కురిపించింది. పాక్‌ అభిమానులు కూడా కోహ్లీ ఆటతీరుకు ఫిదా అయిపోయారు. పాక్‌ సెలక్టర్ల నిర్ణయాలను, కెప్టెన్‌ బాబర్‌ వ్యూహాలను అక్కడి పత్రికలు తప్పుపడుతున్నాయి.

పాక్‌ ప్రధాన పత్రిక 'డాన్‌' విరాట్‌ ఆటతీరును కొనియాడింది. ఓటమి అంచున ఉన్న భారత్‌ను ఒంటి చేత్తో విజయతీరాలకు చేర్చిన ఘనత అతడిదే అని పేర్కొంది. ఇక పాక్‌ బౌలర్‌ మహమ్మద్‌ నవాజ్‌ భారత్‌కు అయాచితంగా వైడ్‌, నోబాల్‌ రూపంలో అదనపు పరుగులు ఇవ్వడం ఫలితాన్ని నాటకీయంగా మార్చేసిందని అభిప్రాయపడింది. పాక్‌ సెలక్షన్‌ కమిటీ లోపాలను విరాట్‌ బహిర్గతం చేశాడని మరో కథనంలో విశ్లేషించింది. ముగ్గురు స్పిన్నర్లను ఎంపిక చేసి తప్పుచేసిందని పేర్కొంది. సయిద్‌ అజ్మల్‌ తర్వాత పాక్‌కు డెత్‌ ఓవర్లు వేసే స్పిన్నరే దొరకలేదని పేర్కొంది. నలుగురు ఫాస్ట్‌బౌలర్లను ఎంపిక చేసుకొని ఉండాల్సిందని అభిప్రాయపడింది.

నరాలు తెగే ఉత్కంఠతో కూడిన మ్యాచ్‌ను విరాట్‌-పాండ్య ద్వయం సాయంతో భారత్‌ గెలిచిందని పాక్‌ పత్రిక 'ది న్యూస్‌' పేర్కొంది. పాక్‌ ప్రధాని సహా పలువురు ప్రముఖులు తమ జట్టుకు ధైర్యం చెబుతూ సామాజిక మాధ్యమాల్లో చేసిన కామెంట్లను ప్రస్తావించింది. ఈ మ్యాచ్‌ను పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ 'గ్రేట్‌ గేమ్‌' అంటూ ప్రశంసించారు.

ఇక 'నవాజ్ నువ్వు నా మ్యాచ్‌ విన్నర్‌వి.. నీపై నమ్మకం ఉంది' అంటూ 20వ ఓవర్‌ వేసిన స్పిన్నర్‌ నవాజ్‌లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు కెప్టెన్‌ బాబర్‌ చేసిన వ్యాఖ్యలను కూడా ఆ పత్రిక పబ్లిష్‌ చేసింది. ఇక విరాట్‌పై అనుష్క శర్మ చేసిన ఇన్‌స్టా పోస్టుపై కూడా ఈ పత్రిక ప్రత్యేకంగా వార్తను పబ్లిష్‌ చేసింది.

విరాట్‌ కోహ్లీ అజేయంగా చేసిన 82 పరుగులతో భారత్‌ విజయం సాధించిందని పాక్‌ పత్రిక 'డెయిలీ టైమ్స్‌' పేర్కొంది. దక్షిణాఫ్రికా వంటి జట్టు ఉన్న గ్రూపులో ఈ విజయం చాలా కీలకమని పేర్కొంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సొంత మైదానంలో విజయం సాధించిన భారత్‌ దూకుడుగా ఉందని పేర్కొంది.

ఇవీ చదవండి : కొత్త పోస్టర్లతో టాలీవుడ్​లో దీపావళి సందడి

సితార డ్యాన్స్​ సూపర్​.. స్పెషల్​ వీడియోతో మహేశ్​​ దీపావళి విషెస్

Last Updated : Oct 24, 2022, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.