ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​ మ్యాచ్​లపై క్లారిటీ అప్పుడే - ఐసీసీ న్యూస్

T20 World Cup 2022: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​ నిర్వహణకు ముహూర్తం ఫిక్సయింది. త్వరలోనే పొట్టి ప్రపంచకప్​ టోర్నీలో ఏఏ జట్లు తలపడనున్నాయనే విషయంపై ఐసీసీ క్లారిటీ ఇవ్వనుంది.

T20 WC
టీ20 ప్రపంచకప్
author img

By

Published : Jan 14, 2022, 3:33 PM IST

T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై దృష్టి పెట్టింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). ఈ మేరకు జనవరి 21న మ్యాచ్​లకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నట్లు పేర్కొంది. పలు మ్యాచ్​ల కోసం టిక్కెట్ల అమ్మకం కూడా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. 2007లో టీ20 ప్రపంచకప్​ టోర్నీ ప్రారంభం కాగా.. ఇది ఎనిమిదో పొట్టి ప్రపంచకప్​ టోర్నీ.

45 మ్యాచ్​లు..

ఈ మెగా టోర్నీ అక్టోబర్​ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది. ఏడు మైదానాల్లో మొత్తంగా 45 మ్యాచ్​లు జరగనున్నాయి. అడిలైడ్, బ్రిస్బేన్, గీలాంగ్, హోబర్ట్, మెల్​బోర్న్, పెర్త్, సిడ్నీ మైదానాలు పొట్టి ప్రపంచకప్​ వేదికలు కానున్నాయి. ఫైనల్​, నవంబర్ 13న మెల్​బోర్న్​ క్రికెట్ మైదానంలో జరగనుంది. సెమీఫైనల్స్ సిడ్నీ, అడిలైడ్, ఓవల్ వేదికగా నవంబర్ 9, 10న నిర్వహించనున్నారు.

సూపర్​ 12..

అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు సూపర్​ 12లో ఉన్నాయి. నమీబియా, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్ క్వాలిఫయర్స్​ ఆడనున్నాయి.

ఇదీ చదవండి:

IND vs SA: పంత్​పై ప్రశంసలు.. మరి వాళ్ల పరిస్థితేంటి?

'ఈ పద్ధతితో కుర్రాళ్లకు రోల్ మోడల్ అవ్వడం కష్టం'

IND vs SA: 'ఒత్తిడిలో టీమ్‌ఇండియా.. అందుకే అలా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.