ETV Bharat / sports

ఇదే జరిగితే.. టీమ్​ఇండియా, పాక్​ మధ్యే తుదిపోరు.. 2007 ఫైనల్​ రిపీట్​!

టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-12 మ్యాచ్​లు ముగియడం వల్ల సెమీస్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఈ పోరులో టీమ్‌ ఇండియా.. ఇంగ్లాండ్‌ని ఓడిస్తే పాకిస్థాన్‌తో టైటిల్‌ పోరులో తలపడుతుంది. ఇలా గనక జరిగితే క్రికెట్‌ అభిమానులకు మరోసారి పసందైన వినోదం ఖాయం.

india vs pakistan
టీమ్​ఇండియా పాక్​
author img

By

Published : Nov 7, 2022, 7:23 AM IST

టీ20 ప్రపంచకప్​ హోరాహోరీగా సాగుతోంది. దాదాపు సెమీస్​ బెర్త్​లు ఫిక్స్​ అయ్యాయి . గ్రూపు -1 నుంచి న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ సెమీస్‌కు చేరగా.. గ్రూపు-2 నుంచి భారత్‌, పాకిస్థాన్‌ నాకౌట్‌ పోరుకు అర్హత సాధించాయి. గ్రూపు-2లో నెదర్లాండ్స్‌ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవడంతో భారత్‌.. బంగ్లాపై విజయం సాధించడం వల్ల పాకిస్థాన్‌ సెమీస్‌కు చేరాయి. దీంతో ఇప్పుడు క్రికెట్‌ ప్రేమికుల దృష్టి అంతా టీమ్‌ఇండియా, పాక్‌ జట్లపైనే పడింది. ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఇప్పటికే ఓ మ్యాచ్‌ జరగ్గా.. దాంట్లో టీమ్‌ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు మరోసారి తలపడటానికి అవకాశాలు ఉన్నాయి.

బుధవారం జరిగే తొలి సెమీ ఫైనల్స్‌లో గ్రూప్‌-1లో అగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌తో పాకిస్థాన్‌ అమితుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌.. కివీస్‌ని ఓడిస్తే ఫైనల్స్‌కు చేరుకుంటుంది. గురువారం జరిగే రెండో సెమీస్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ తలపడనున్నాయి. ఈ పోరులో టీమ్‌ఇండియా.. ఇంగ్లాండ్‌ని ఓడిస్తే పాకిస్థాన్‌తో టైటిల్‌ పోరులో తలపడుతుంది. ఇలా గనక జరిగితే క్రికెట్‌ అభిమానులకు మరోసారి పసందైన వినోదం ఖాయం.

2007 సీన్‌ రిపీట్‌ అవుతుందా?
2007 టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాక్‌ రెండుసార్లు తలపడ్డాయి. గ్రూప్‌ దశలో జరిగిన మ్యాచ్‌ టై కాగా.. బౌలౌట్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. తుది పోరు కూడా ఈ దాయాది దేశాల మధ్యే జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ 157/5 స్కోరు సాధించగా.. లక్ష్య ఛేదనలో పాక్ 19.3 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో భారత్ 5 పరుగుల తేడాతో గెలిచి టైటిల్‌ని దక్కించుకుంది. ఈసారి కూడా భారత్‌, పాక్‌ మధ్యే ఫైనల్స్‌ జరగాలని, ఆ మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం సాధించాలని భారత క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఫైనల్స్‌కు ఏ జట్లు చేరతాయో!!

ఇదీ చదవండి: హాఫ్​ సెంచరీలతో అదరగొట్టిన సూర్య, రాహుల్​.​. జింబాబ్వే టార్గెట్​ ఎంతంటే?

శ్రీలంక స్టార్ క్రికెటర్​పై​ అత్యాచార ఆరోపణలు.. ఆస్ట్రేలియాలో అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.