క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచేందుకు టీ-20 ప్రపంచకప్(T20 world cup 2021) వచ్చేసింది. గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు ఆదివారమే ప్రారంభమైనా.. సిసలైన పోరు అక్టోబర్ 23 నుంచే. ఐదేళ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్ జరుగుతుండటం వల్ల అభిమానుల ఆనందానికి కొదువ లేదు. ఈ ఫార్మాట్లో మొట్టమొదటిసారి విజేతగా నిలిచిన టీమ్ ఇండియాతో (T20 world cup 2021 india team) పాటు.. ఇంగ్లాండ్, డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ ఫేవరేట్లుగా బరిలోకి దిగుతున్నాయి. యూఏఈ, ఒమన్ వేదికగా మ్యాచ్‌లు జరుగుతుండటం.. పాకిస్థాన్‌కు కలిసివచ్చే విషయం. ఆ జట్టు కూడా గట్టి పోటీ నిచ్చే అవకాశాలున్నాయి. పసికూనలు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లనూ తక్కువ అంచనాలు వేయడానికి వీల్లేదు.
ప్రపంచకప్(T20 world cup 2021 schedule) నేపథ్యంలో ఇవి తెలుసుకోండి..
టీ-20 ప్రపంచకప్ ఎక్కడ జరుగుతోంది?
వాస్తవానికి ఈ ప్రపంచకప్(T20 world cup 2021) భారత్‌లో జరగాల్సింది. కరోనా కారణంగా వేదికను ఒమన్, యూఏఈకి మార్చింది ఐసీసీ.
- సూపర్-12 క్వాలిఫయర్ మ్యాచ్‌లు మాత్రమే ఒమన్‌లో జరగనున్నాయి.
- సూపర్-12, నాకౌట్, ఫైనల్ దుబాయ్, షార్జా, అబుదాబిలో జరుగుతాయి.
ఎప్పటినుంచి ఎప్పటివరకు..?
అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ప్రపంచకప్(T20 world cup 2021) జరగనుంది.
అయితే.. అక్టోబర్ 22 వరకు జరిగేవి క్వాలిఫయర్ మ్యాచ్‌లే. 23 నుంచే అసలైన పోరు(T20 world cup 2021 schedule) మొదలయ్యేది.
అక్టోబర్ 18,20 తేదీల్లో వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి.
జట్లు, గ్రూప్‌లు..
- గ్రూప్1: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఏ1,బీ2
- గ్రూప్2: ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, బీ1,ఏ2
పై 8 జట్లు నేరుగా సూపర్-12కు అర్హత సాధించాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్, పపువా న్యూ గినియా, ఒమన్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులో అర్హత సాధించిన నాలుగు జట్లు సూపర్ 12లోకి ప్రవేశిస్తాయి.
గ్రూప్-1, గ్రూప్-2ల్లో తొలి 2 స్థానాల్లో నిలిచిన 4 జట్లు సెమీఫైనల్ ఆడతాయి. అందులో గెలిచిన జట్లు ఫైనల్‌కు(T20 world cup 2021 schedule) అర్హత సాధిస్తాయి. నవంబర్ 14న దుబాయ్ వేదికగా ఫైనల్.
భారత్ మ్యాచ్‌లు ఎప్పుడు?
- టీమ్ ఇండియా(T20 world cup 2021 india team) తొలిమ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో.. అక్టోబర్ 24న ఆడనుంది.
- అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
- మరో రెండు మ్యాచ్‌లను నవంబర్ 5, 8న ఆడనుంది.
పాయింట్ల విధానం ఎలా?
గెలిస్తే 2 పాయింట్లు, టై/రద్దు అయిన సందర్భాల్లో ఒక పాయింట్, ఓడితే జీరో పాయింట్లు లభిస్తాయి.
డీఆర్ఎస్ ఉందా?
పురుషుల టీ-20 ప్రపంచకప్‌లో(T20 world cup 2021) తొలిసారి నిర్ణయ సమీక్ష విధానం(డీఆర్ఎస్) అమల్లోకి రానుంది. ప్రతి జట్టుకు ఇన్నింగ్స్‌కు రెండుసార్లు డీఆర్ఎస్ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది.
రిజర్వ్ డే ఉందా..
వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం లేదా మరే ఇతర పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌లు జరిగే అవకాశం లేనప్పుడు మాత్రమే రిజర్వ్ డే ఉంది. అయితే.. ఇది నాకౌట్ మ్యాచ్‌లకు మాత్రమే.
గ్రూప్ దశలో రిజర్వ్ డే లేదు.
ప్రైజ్‌మనీ ఎంత?
- విజేతకు రూ. 12 కోట్లకుపైనే ప్రైజ్‌మనీ దక్కనుంది.
- రన్నరప్‌కు రూ. 6 కోట్లు, సెమీఫైనల్ చేరిన జట్లకు 3 కోట్ల రూపాయల చొప్పున దక్కనున్నాయి.
ఏ సమయానికి..?
వరల్డ్‌కప్ (T20 world cup 2021 schedule) షెడ్యూల్లో దాదాపు ప్రతిరోజూ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3.30 గంటలకు, సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.
ఎందులో వీక్షించొచ్చు?
టీ-20 ప్రపంచకప్‌కు సంబంధించి అన్ని మ్యాచ్‌లను.. స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
హాట్‌స్టార్‌లోనూ లైవ్ స్ట్రీమింగ్ చూడోచ్చు.
ప్రేక్షకులకు అనుమతి ఉందా?
ఐపీఎల్‌ల్లాగే.. ఇక్కడా ప్రేక్షకులకు అనుమతి ఉంది. యూఏఈలోని వేదికలన్నింటిలోనూ 70 శాతం సీటింగ్ సామర్థ్యం కల్పించనుంది ఐసీసీ.
టీ-20 ప్రపంచకప్ విజేతలు..
2007లో మొట్టమొదటిసారి జరిగిన టీ-20 ప్రపంచకప్‌ను టీమ్ ఇండియా నెగ్గింది. వెస్టిండీస్ అత్యధికంగా రెండుసార్లు టైటిల్ నెగ్గింది.
- 2007- ఇండియా
- 2009- పాకిస్థాన్
- 2010- ఇంగ్లాండ్
- 2012- వెస్టిండీస్
- 2014- శ్రీలంక
- 2016- వెస్టిండీస్
2022 టీ-20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరగనుంది.
ఇవీ చూడండి: T20 World Cup 2021: మెగా టోర్నీలో భారత జట్టుదే పైచేయి!