టీ20 ప్రపంచకప్‌లో(T20 world cup 2021) భాగంగా టీమ్ఇండియా తమ మ్యాచ్‌లను అక్టోబర్ 24(ఆదివారం) నుంచి ప్రారంభించనుంది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో(teamindia pakisthan match 2021) తలపడనుంది. చివరిసారిగా 2019 వన్డే ప్రపంచకప్‌లో పోటీ పడిన ఈ రెండు జట్లు మళ్లీ (pak india match 2021) ఈ మెగాటోర్నీలో బరిలోకి దిగబోతున్నాయి. దీంతో ఈ మ్యాచ్ కోసం ప్రపంచంలోని క్రికెట్ ప్రేమికులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా, 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్(2007 worldcup final)..లో తలపడిన పాకిస్థాన్, భారత జట్టులో ఉన్న ఆటగాళ్లలో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే తాజా ప్రపంచకప్‌లో ఆడుతున్నారు. వారిలో టీమ్ఇండియా నుంచి రోహిత్ శర్మ ఒక్కడే ఉండగా.. పాక్ నుంచి మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్‌లు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి ప్రదర్శనను ఓ సారి నెమరువేసుకుందాం.
రోహిత్ శర్మ
రోహిత్‌శర్మ(rohithsharma t20 worldcup).. తన కెరీర్లో ప్రపంచకప్‌లో ఆడే అవకాశాన్ని తొందరగానే అందుకున్నాడు. 2007 తొలి సీజన్ వరల్డ్‌కప్ ద్వారా తన టీ20 కెరీర్ ప్రారంభించాడు(2007 t20 world cup rohit sharma runs) . అప్పటికీ పెద్దగా అనుభవం లేని అతడు ఆ టోర్నీ ఫైనల్లో మంచి ప్రదర్శన చేశాడు. ఆరో స్థానంలో వచ్చి 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 5 పరుగులు తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం ప్రపంచకప్ సమయానికి అతడు వైస్‌కెప్టెన్, స్టార్ ఓపెనర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం టీమ్ఇండియా కెప్టెన్‌గా ఉన్న కోహ్లీకి కూడా టీ20 ప్రపంచకప్‌లో ఇంతటి అనుభవం లేదు.
మహ్మద్ హఫీజ్
పాకిస్థాన్ సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్(mohammad hafeez t20 world cup) 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఓపెనింగ్ స్థానంలో ఆడాడు. అయితే ఆ మ్యాచ్‌లో అతడు తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. బౌలింగ్‌లోనూ అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మూడు ఓవర్లు వేసిన ఇతడు 25 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా ద్కకించుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. మరి ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో అతడు ఎలా ఆడతాడు అనేది ఆసక్తిగా మారింది.
షోయబ్ మాలిక్
2007 టీ20 ప్రపంచకప్‌లో(mohammad hafeez t20 world cup) పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు షోయబ్ మాలిక్. జట్టును ఫైనల్‌కు చేర్చిన అతడు టీమ్ఇండియా చేతిలో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో 17 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. తాజా వరల్డ్‌కప్‌లో ముందుగా ప్రకటించిన జట్టులో మాలిక్ పేరు లేదు. ఆ తర్వాత సోహైబ్ మక్సూద్‌కు గాయం కావడం వల్ల షోయబ్ జట్టులోకి వచ్చాడు. మరి ఇతడు ప్రభావం చూపుతాడో లేదో తేలాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
ఇదీ చూడండి: T20 World Cup: భారత్-పాక్ పోరు.. టీమ్ఇండియాదే జోరు!