టీ10 ఫార్మాట్ క్రికెట్‌కు(T10 League 2021) భవిష్యత్తులో మంచి ఆదరణ లభిస్తుందని దక్షిణాఫ్రికా జట్టు మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్(Faf Du Plessis News) అభిప్రాయపడ్డాడు. ఈ ఫార్మాట్‌ను ఒలింపిక్స్‌లోనూ పరిచయం చేయాలని సూచించాడు.
"చాలా కాలంపాటు మూడు ఫార్మాట్లలోనూ నేను ఆడాను. కానీ, టీ10 లీగ్‌కు ఆకర్షితుడనయ్యాను. నాలాంటి చాలామంది ఆటగాళ్లు.. ఇలాంటి టోర్నీల కోసమే వేచిచూస్తారు. టీ10కి భవిష్యత్తు ఉంది. ఒలింపిక్స్‌లోనూ దీన్ని పరిచయం చేయొచ్చు. ఫ్యాన్స్‌ను భారీ స్థాయిలో ఆకట్టుకునే లీగ్ ఇది"
--డుప్లెసిస్, దక్షిణాఫ్రికా ఆటగాడు.
ఓ ఫార్మాట్ క్రికెట్ నుంచి మరో ఫార్మాట్ క్రికెట్‌కు మారుతుంటే ఆటతీరు మనకు అర్థమవుతుందని తెలిపాడు డుప్లెసిస్. బంగ్లా టైగర్స్ జట్టుకు(Bangla Tigers T10 2021) ఇతడు కెప్టెన్‌గా ఉన్నాడు. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం ఇష్టమని చెప్పాడు. జట్టులోని ఆటగాళ్లందరూ ఆటను ఆస్వాదించేలా చేయడం సారథిగా తన బాధ్యత అని అన్నాడు. జావేద్ క్రికెట్ మైదానంలో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 4 వరకు జరగనుంది అబుదాబి టీ10 లీగ్.
ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు డుప్లెసిస్. ఈ ఏడాది ధోనీ సారథ్యంలో మరోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది సీఎస్కే.
ఇదీ చదవండి: త్వరలో టీ10 లీగ్.. ఫ్యాన్స్‌కు 'డబుల్' బొనాంజా