ETV Bharat / sports

న్యూజిలాండ్​తో మ్యాచ్​​.. 9ఏళ్ల నాటి రోహిత్​ ట్వీట్​ వైరల్​ - టీ20 సిరీస్​ తాజా వార్తలు

మరి కొద్ది గంటల్లో టీమ్​ఇండియా-న్యూజిలాండ్(nz vs ind t20 series 2021) ​ మధ్య టీ20 సిరీస్​​ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో 9ఏళ్ల క్రితం రోహిత్​ శర్మ చేసిన ఓ ట్వీట్​ వైరల్​గా మారింది. ఇంతకీ అదేంటంటే?

nz vs ind t20 series 2021
న్యూజిలాండ్ వర్సెస్ టీమ్​ఇండియా
author img

By

Published : Nov 17, 2021, 6:04 PM IST

న్యూజిలాండ్​తో టీ20 సిరీస్​కు (nz vs ind t20 series 2021) టీమ్​ఇండియా సర్వం సిద్ధం అయింది. నేడు(నవంబర్​ 17) సాయంత్రం మొదటి మ్యాచ్ జైపూర్​ వేదికగా​ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్​ ఇండియన్​ టీ20 చరిత్రలో కొత్త శకానికి ఆరంభం కానుంది. టీమ్​ఇండియాకు రోహిత్ పూర్తి స్థాయి కెప్టెన్​గా బాధ్యతలు చేపడుతున్నాడు. అసలు విషయం ఏంటంటే.. 9 ఏళ్ల క్రితం ఇదే జైపూర్​లో ముంబయి తరఫున రంజీ ట్రోఫీకి రోహిత్ సారథిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆ సమయంలో 'టీమ్​ను లీడ్​ చేయబోతున్నాను' అంటూ రోహిత్ ట్వీట్​ చేశాడు. ఇప్పుడా ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

nz vs ind t20 series 2021
కెప్టెన్​గా రోహిత్

తొమ్మిదేళ్ల క్రితం ముంబయి తరపున రంజీ ట్రోఫీకి (rohit sharma as captain in t20) రోహిత్ కెప్టెన్​గా వ్యవహరించాడు. జైపూర్​లోని కేఎల్​ సైనీ మైదానమే అందుకు వేదికైంది. ప్రస్తుతం టీమ్​ఇండియాకు పూర్తి స్థాయి కెప్టెన్​గా ఇదే జైపూర్​లో ఆడటం విశేషం.

టీమ్​ఇండియా-న్యూజిలాండ్​.. నవంబరు 17, 19, 21న జైపూర్​, రాంచీ, కోల్​కతా వేదికగా టీ20 సిరీస్​, కాన్పూర్(25-29), ముంబయి(డిసెంబరు 3-7) టెస్ట్​ సిరీస్​ ఆడనున్నారు. ​

ఇదీ చదవండి:IND vs NZ: భారత్​తో టీ20 సిరీస్​కు కివీస్​ స్టార్ పేసర్ దూరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.