ETV Bharat / sports

తండ్రిగా ప్రమోషన్​.. అదే రోజు క్రికెట్ కోసం దుబాయ్​కు..! - ప్యాట్ కమిన్స్ భార్య

తండ్రిగా ప్రమోషన్​ వచ్చిన రోజే.. జాతీయ జట్టు తరఫున క్రికెట్​ ఆడేందుకు విదేశానికి వెళ్లాడు ఆస్ట్రేలియా క్రికెటర్​ ప్యాట్​ కమిన్స్(Pat Cummins news latest news)​. టీ20 ప్రపంచకప్​ కోసం దుబాయ్​ బయలుదేరిన ఆసీస్​ బృందంలో కమిన్స్​ ఉన్నాడు. 2021 ఐపీఎల్​ సీజన్​లో (Pat Cummins ipl 2021) మధ్యలోనే ఇంటికి వెళ్లిన కమిన్స్.. ఇన్ని రోజులు తన కుటుంబంతో గడిపాడు.

Pat Cummins news
ప్యాట్ కమిన్స్ శిశువు
author img

By

Published : Oct 12, 2021, 7:21 PM IST

ఆస్ట్రేలియా క్రికెటర్​ ప్యాట్​ కమిన్స్​ తండ్రయ్యాడు. అతడి భార్య.. అక్టోబర్​ 8న పండంటి మగబిడ్డకు(Pat Cummins child) జన్మనిచ్చింది. ఆ శిశువుకు అల్బీ బోస్టన్​ కమిన్స్​ అని పేరు పెట్టారు. అయితే.. అదే రోజు కమిన్స్​ క్రికెట్​ ఆడేందుకు దుబాయ్​ వెళ్లాల్సి వచ్చింది. టీ-20 ప్రపంచకప్​ కోసం దుబాయ్​ బయలుదేరిన ఆసీస్​ బృందంలో కమిన్స్​ కూడా ఉన్నాడు.

ఈ నేపథ్యంలో.. తన భార్య గర్భధారణ నుంచి శిశువు జననం వరకు కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను వీడియో రూపంలో ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేశాడు. 2021 ఐపీఎల్​ సీజన్​ మధ్యలోనే ఇంటికి వెళ్లిన కమిన్స్​.. అప్పటినుంచి కుటుంబంతోనే గడిపాడు.

తన భార్య గర్భవతి అయిందనే ఆనందాన్ని ప్యాట్​ కమిన్స్ వ్యక్తపరుస్తుండగా ఈ వీడియో మొదలవుతుంది. కమిన్స్ కుటుంబం మొత్తం సంతోషం వ్యక్తం చేస్తుంది. గర్భధారణకు ముందు ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ భార్య తన మధురానుభూతులను పంచుకుంటుంది.

ప్రపంచకప్​ కోసం వెళ్లిన ఆయా జట్లు.. ఆరు రోజుల పాటు క్వారంటైన్​లో ఉండనున్నాయి. అక్టోబర్​ 18న న్యూజిలాండ్​తో ఆస్ట్రేలియా టీం వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ప్రపంచకప్​లో ఆసీస్​ మొదటి మ్యాచ్​ అక్టోబర్​ 23న జరగనుంది.

ఇదీ చదవండి:IPL 2021: 'ఓటమితో బాధపడినా.. ఈ సీజనే ప్రత్యేకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.