ETV Bharat / sports

Ind vs scotland: చెలరేగిన భారత బౌలర్లు.. స్కాట్లాండ్​ 85 ఆలౌట్​ - undefined

టీమ్​ఇండియా బౌలర్లు రెచ్చిపోవడం వల్ల దుబాయ్​ వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో.. స్కాట్లాండ్​ 17.4 ఓవర్లకు 85 పరుగులకు ఆలౌట్​ అయ్యింది. జడేజా, షమి తలో మూడు వికెట్లు పడగొట్టారు.

Ind vs scotland
చెలరేగిన భారత బౌలర్లు.. స్కాట్లాండ్​ 93ఆలౌట్​
author img

By

Published : Nov 5, 2021, 8:56 PM IST

Updated : Nov 5, 2021, 9:10 PM IST

దుబాయ్​ వేదికగా స్కాట్లాండ్​తో జరుగుతున్న మ్యాచ్​లో టీమ్​ఇండియా బౌలర్లు చెలరేగిపోయారు. జడేజా, షమి విజృంభించగా 17.4 ఓవర్లలో స్కాట్లాండ్​ జట్టు.. కేవలం 85పరుగులకే ఆలౌట్​ అయ్యింది. షమి, జడేజా తలో మూడు వికెట్లు పడగొట్టారు.

ఇన్నింగ్స్​ సాగిందిలా..

టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న కోహ్లీకి తన నిర్ణయం సరైనదే అని తెలిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. 13 పరుగుల వద్ద తొలి వికెట్​ కోల్పోయిన స్కాట్లాండ్​.. భారత బౌలర్ల ధాటికి ఆ తర్వత కోలుకోలేకపోయింది. బుమ్రా తొలి వికెట్​ తీసి ఇండియాకు బ్రేక్​ ఇవ్వగా.. జడేజా, షమి రెచ్చిపోయారు. ముఖ్యంగా తన 4 ఓవర్ల కోటాలో జడేజా 15 పరుగులే ఇచ్చి.. 3 వికెట్లు పడగొట్టాడు. షమి.. కేవలం మూడు ఓవర్లలోనే 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. వీరిద్దరి బౌలింగ్​ స్కాట్లాండ్​ బ్యాటర్లు ఇద్దరు బౌల్ట్​ అయ్యారు. అవి మ్యాచ్​కే హైలైట్​ అని చెప్పుకోవచ్చు. షమి వేసిన 17వ ఓవర్లో వరుసగా మూడు వికెట్లు పడ్డాయి(రెండో వికెట్​ రనౌట్). జడేజా, షమి ఇచ్చిన ఊపుతో మిగిలిన బౌలర్లు కూడా జోష్​ పెంచారు. బుమ్రా 2, అశ్విన్​కు 1 వికెట్​ తీశారు.

భారత బౌలర్ల ధాటికి స్కాట్లాండ్​ విలవిలలాడింది. ఆ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు సున్నా పరుగులకే వెనుదిరిగారు. మొత్తం మీద 24పరుగులు చేసిన ఓపెనర్​ మున్సే.. జట్టు టాప్​ స్కోరర్​.

ఆశలెన్నో...

స్కాట్లాండ్​ను అతి తక్కువ పరుగులకు కట్టడి చేయడం టీమ్​ఇండియాకు కలిసి వచ్చే విషయం. టోర్నీలో సెమీస్​కు చేరడం కష్టమే అయినా.. సాంకేతికంగా భారత్​కు ఇంకా అవకాశం ఉంది. ఈ మ్యాచ్​ను టీమ్​ఇండియా తొందరగా ముగించేస్తే.. నెట్​ రన్​రేట్​ పెరుగుతుంది. ఏది ఏమైనా.. అఫ్గానిస్థాన్​- న్యూజిలాండ్​ మ్యాచ్​పైనే ఆధారపడి ఉంటుంది!

ఇదీ చూడండి:- 'ట్రోఫీ గెలవకపోతే.. ఎన్ని సెంచరీలు చేసినా వృథానే'

Last Updated : Nov 5, 2021, 9:10 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.