ETV Bharat / sports

రోహిత్​తో అవేశ్​ ఫ్యాన్ బాయ్ మూమెంట్

author img

By

Published : Apr 21, 2021, 5:29 PM IST

దిల్లీ క్యాపిటల్స్​ పేసర్ అవేశ్​ ఖాన్​కు టీమ్ఇండియా బ్యాట్స్​మెన్ రోహిత్ శర్మ అంటే చాలా అభిమానం. మంగళవారం ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్ తర్వాత తనకు ఇష్టమైన క్రికెటర్ రోహిత్​ను కలిశాడు అవేశ్. తన జెర్సీపై హిట్​మ్యాన్ ఆటోగ్రాఫ్ తీసుకుని మురిసిపోయాడు.

avesh khan
ఆవేశ్ ఖాన్

ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు అవేశ్ ఖాన్. కాగా, ఇతడి ఫేవరేట్ ప్లేయర్ రోహిత్ శర్మ. హిట్​మ్యాన్​ను కలవడం కోసం ఎంతోకాలంగా ఎదురుచూసిన అవేశ్.. ముంబయితో మ్యాచ్ ముగిసిన తర్వాత తన కోరిక తీర్చుకున్నాడు. రోహిత్​ను కలిసి జెర్సీపై తన సంతకం తీసుకున్నాడు. ఈ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది దిల్లీ ఫ్రాంఛైజీ.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (44) కెప్టెన్ ఇన్నింగ్స్​ ఆడగా మిగతావారు అతడికి మద్దతుగా నిలవలేకపోయారు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన దిల్లీ క్యాపిటల్స్‌ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి విజయం సొంతం చేసుకుంది. ధావన్‌ (45), స్మిత్‌ (33) రాణించారు.

దిల్లీ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా నాలుగు వికెట్లతో ముంబయి పతనాన్ని శాసించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్​గా నిలిచాడు.

ఇదీ చదవండి : 'టెస్టు క్రికెట్​ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.