టీ20 ప్రపంచకప్‌లో (T20 world cup 2021) భారత్-పాక్ జట్లు అక్టోబర్ 24 సాయంత్రం బరిలోకి దిగనున్నాయి. ఈ క్రమంలో షోయబ్ అక్తర్, హాస్యభరిత సలహాను (india vs pakistan match) పాకిస్థాన్ జట్టుకు ఇచ్చాడు. భారత్‌పై గెలవాలంటే మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా ఆటగాళ్లకు నిద్రమాత్రలు ఇవ్వాలని సూచించాడు. మెంటార్ ధోనీని బ్యాట్ పట్టుకోకుండా చూసుకోవాలని పాక్ జట్టుకు చెప్పాడు.
"భారత్‌పై గెలవాలంటే పాక్‌కు మూడు సలహాలు ఇస్తున్నాను. టీమ్ఇండియాకు నిద్రమాత్రలు ఇవ్వండి. రెండోది.. రెండు రోజులపాటు విరాట్ కోహ్లీని ఇన్స్టాగ్రామ్ ఉపయోగించుకుండా అడ్డుపడండి. మూడు.. మెంటార్ ధోనీ బ్యాట్ పట్టుకోకుండా చూసుకోండి"
-షోయబ్ అక్తర్, పాక్ మాజీ బౌలర్
ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో పాక్ ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇవ్వాలని తమ జట్టుకు సూచించాడు అక్తర్. డాట్ బాల్స్ లేకుండా చూసుకోవాలని చెప్పాడు. 5-6 ఓవర్ల వరకు బాల్ టూ బాల్ రన్ రేట్ కాపాడుకోవాలని సూచించాడు. మంచి లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచితే.. బౌలింగ్‌లో విరుచుకుపడి, సులభంగా వికెట్లు తీయవచ్చని పేర్కొన్నాడు.
ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు తమ ఆటగాళ్ల జాబితాను ఇంకా ప్రకటించలేదు. దీంతో.. మ్యాచ్‌లో ఆడబోయే భారత జట్టులో ఈ క్రింది ప్లేయర్స్ ఉండొచ్చని అంచనా వేశాడు అక్తర్.
-
GAME. FACE. ON 👊 🙌#TeamIndia #T20WorldCup pic.twitter.com/fK8kDpqv8w
— BCCI (@BCCI) October 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">GAME. FACE. ON 👊 🙌#TeamIndia #T20WorldCup pic.twitter.com/fK8kDpqv8w
— BCCI (@BCCI) October 24, 2021GAME. FACE. ON 👊 🙌#TeamIndia #T20WorldCup pic.twitter.com/fK8kDpqv8w
— BCCI (@BCCI) October 24, 2021
ఇదీ చదవండి:Ind vs pak T20: దాయాదుల పోరు- అభిమానుల పూజలు, హోమాలు