ETV Bharat / sports

సూర్య భాయ్ ధనాధన్ సెంచరీ- రోహిత్ రికార్డ్ సమం- ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ - భారత్ సౌతాఫ్రితా పర్యటన

Suryakumar Yadav 4th T20 : టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్​ యాదవ్, సౌతాఫ్రికా పర్యటనలో టీ20 కెరీర్​లో నాలుగో సెంచరీ బాదాడు. దీంతో అతడు పొట్టి ఫార్మాట్​లో అత్యధిక సెంచరీలు బాదిన రోహిత్ శర్మ (4) సరసన నిలిచాడు.

Etv Bhasuryakumar yadav 4th t20
suryakumar yadav 4th t20
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 10:18 PM IST

Updated : Dec 14, 2023, 10:51 PM IST

Suryakumar Yadav 4th T20 : సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రఫ్పాడించాడు. అతడు ధనాధన్​ ఇన్నింగ్స్​తో (100 పరుగులు : 56 బంతులు 7x4, 8x6) బౌండరీల మోత మొగిస్తూ సెంచరీ బాదేశాడు. టీ20ల్లో సూర్యకు ఇది 4వ సెంచరీ. దీంతో టీ20ల్లో అత్యధిక శతకాలు బాదిన రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్​వెల్ (4) రికార్డును సూర్యకుమార్ సమం చేశాడు. మరోవైపు యంగ్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (60 పరుగులు : 41 బంతుల్లో, 6x4, 3x6) కీలక ఇన్నింగ్స్​ ఆడాడు. వీరిద్దరి అద్భుత ఆటతో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి, ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్​ను ఉంచింది. సఫారీ బౌలర్లలో లియాద్ విలియమ్స్ 2, కేశవ్ మహరాజ్ 2, షంసీ, బర్జర్ తలో వికెట్ దక్కించుకున్నారు.

గిల్ మరో'సారీ' : టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియాకు పేలవ ఆరంభం దక్కింది. గత మ్యాచ్​లో డకౌట్​గా వెనుదిరిగిన స్టార్ బ్యాటర్ శుభ్​మన్ గిల్ (12) ఈ మ్యాచ్​లోనూ స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. వన్​ డౌన్​లో వచ్చిన తిలక్ వర్మ (0) ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్య, జైశ్వాల్​తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ మూడో వికెట్​కు 112 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఈ జోడీని స్పిన్నర్ షంసీ విడగొట్టాడు. తర్వాత వచ్చిన రింకూ సింగ్ (14) వేగంగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకున్నాడు. ఇక చివరి ఓవర్లో సూర్య 55 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకొని తరువాతి బంతికి క్యాచౌట్​గా పెవిలియన్ చేరాడు.

ఈ మ్యాచ్​లో నమోదైన పలు రికార్డులు

  • టీ20​ల్లో అత్యధిక సిక్స్​లు బాదిన రెండో టీమ్ఇండియా బ్యాటర్​గా సూర్య రికార్డు కొట్టాడు. అతడి కంటే ముందు రోహిత్ (182) ఉన్నాడు. విరాట్ (117)తో మూడో ప్లేస్​లో ఉన్నాడు.
  • టీ20ల్లో 4 లేదా అంతకంటే కింది స్థానంలో బ్యాటింగ్​కు వచ్చి అత్యధిక సెంచరీలు (4) బాదిన బ్యాటర్ సూర్య. అతడి తర్వాత మ్యాక్స్​వెల్ (3) ఉన్నాడు.
  • ఈ మ్యాచ్​​లో టీమ్ఇండియా బ్యాటర్ జితేశ్ శర్మ హిట్​ వికెట్​గా వెనుదిరిగాడు. టీ20ల్లో ఇలా ఔటైన ఐదో టీమ్ఇండియా బ్యాటర్ జితేశ్. అతడి కంటే ముందు రాహుల్, హర్షల్ పటేల్, హార్దిక్ పాండ్య, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు.
  • సూర్య ఆడిన చివరి 26 బంతుల్లో 265 స్టైక్​ రేట్​తో 65 పరుగులు బాదడం విశేషం.
  • టీ20ల్లో కెప్టెన్ హోదాలో సెంచరీ బాదిన రెండో బ్యాటర్ సూర్య. అతడికంటే ముందు రోహిత్ (118, 111*) రెండుసార్లు సెంచరీ మార్క్ అందుకున్నాడు.

దక్షిణాఫ్రికాతో మూడో టీ20 - ధారాళంగా పరుగులిచ్చిన భారత బౌలర్లు - ఇప్పుడేం చేస్తారో ?

టీమ్ఇండియా ఫ్యాన్స్​కు షాక్- సౌతాఫ్రికా టూర్​కు షమీ దూరం- కారణం ఇదే!

Last Updated : Dec 14, 2023, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.