ETV Bharat / sports

ICC T20I Rankings: దుమ్ములేపిన సూర్యకుమార్, వెంకటేశ్ అయ్యర్​ - T20 international rankings

ICC T20I Rankings: ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్​లో భారత ఆల్​రౌండర్లు సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్​ సత్తాచాటారు. జాబితాలో అమాంతం పైకి దూసుకొచ్చారు. వారితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ర్యాంకులు ఎలా ఉన్నాయంటే?

Venkatesh Iyer
Suryakumar Yadav
author img

By

Published : Feb 23, 2022, 3:50 PM IST

Updated : Feb 23, 2022, 4:00 PM IST

ICC T20I Rankings: ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్స్​లో టీమ్​ఇండియా మిడిలార్డర్​ ద్వయం సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్​ సత్తాచాటింది. బుధవారం ప్రకటించిన తాజా టీ20 ర్యాంకింగ్స్​లో సూర్య.. 35 స్థానాలు ఎగబాకి 21వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు అయ్యర్​.. 203వ స్థానం నుంచి 115కు ఎగబాకాడు. వెస్టిండీస్​తో సిరీస్​లో అద్భుత ప్రదర్శనతో వీరి ర్యాంకులు మెరుగుపడ్డాయి.

కేఎల్​ రాహుల్​ రెండు స్థానాలు పడిపోయి 6వ ర్యాంకులో ఉన్నాడు. విరాట్​ కోహ్లీ 10వ స్థానంలోనే కొనసాగుతున్నాడు. బౌలర్లు, ఆల్​రౌండర్ల జాబితాలో టాప్-​10లో ఒక్క భారత క్రికెటర్​కు చోటు దక్కలేదు.

టెస్టుల్లో ఇలా..

టెస్టు ర్యాంకింగ్స్​లో రోహిత్ శర్మ 6వ స్థానంలో ఉండగా, విరాట్​ కోహ్లీ అతడి తర్వాతి స్థానంలో (7) ఉన్నాడు. బౌలర్లలో అశ్విన్ (2), బుమ్రా (10) టాప్​10లో ఉన్నారు. ఆల్​రౌండర్ల జాబితాలోనూ అశ్విన్ రెండో ర్యాంకులో ఉండగా, జడేజా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇదీ చూడండి: లంకకు భారీ షాక్​.. భారత్​తో సిరీస్​కు స్టార్​ ఆల్​రౌండర్​ దూరం

Last Updated : Feb 23, 2022, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.